కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరిని ఎలా ఎటాక్ చేస్తుందో కూడా తెలియడం లేదు. దాని వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. మరి దీనిని ఎదుర్కోవాలి అంటే.. కొన్ని సంప్రదాయ ఇంటికి చిట్కాలు పాటించడం కూడా తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో.. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
ధనియాలలలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. అంతేకాకుండా విటమిన్ సీ , విటమిన్ ఏ, విటమిన్ కే కూడా పుష్కలంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తని పెంచడంలో ఇవి సహాయం చేస్తాయి. ఈ ధనియాలతో తయారు చేసిన నీటిని రోజూ తాగడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. దానిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా బరగపెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి.. చల్లార్చి తర్వాత తాగాలి. ఇలా తాగడం వల్ల కలిగే లాభాలేంటో కూడా చూసేద్దాం..
శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గించడానికి ఈ ధనియా నీరు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు కనుక ఎక్కువగా స్పైసీ ఆహారం తిని.. దాని వల్ల పొట్టంతా ఒకలా తయారై ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఈ ధనియా నీరు రెండు, మూడు సార్లు తాగితే సరిపోతుంది. దెబ్బకు అంతా సెట్ అయిపోతుంది.
అరుగుదల సమస్య ఉన్నవారికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా.. బరువు తగ్గడానికి కూడా ఇది చక్కగా సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని పరిష్కారం. ప్రతిరోజూ ధనియా వాటర్ తాగితే సరిపోతుంది.
కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉంటే.. ఈ నీటిని ప్రతిరోజూ తాగాలి. ఆ సమస్య తగ్గముఖం పడుతుంది. కిడ్నీల్లోని టాక్సిన్స్ ని తొలగించడానికి సహాయం చేస్తుంది.