ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కచ్చితంగా మూడు పూటలా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందులో పుష్కలంగా ఉంటాయి. ఆ పోషకాలు మనకు అందాలి అంటే.... కచ్చితంగా ఆహారం తీసుకోవాల్సిందే. ఆహారమే మనకు కావాల్సిన బలాన్ని కూడా అందిస్తుంది. చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. కానీ.. చాలా మందికి భోజనం చేసిన వెంటనే కడుపులో నొప్పి వస్తుంది.
భరించలేని నొప్పి కారణంగా చాలా మంది భోజనం చేయడానికి కూడా ఆసక్తి చూపించరు. అసలు ఇలా రావడానికి కారణం ఏంటి..? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో చూద్దాం....
stomach pain
భోజనం చేసిన వెంటనే కడుపులో నొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి అంటే... మీరు విషపూరితమైన ఆహారం లేదంటే.... క్రిములు కీటకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. పాడైన ఆహారం తిన్నా కూడా వెంటనే ఇలా కడుపులో నొప్పి వస్తుంది. ఆహారం సరిగా ఉడకని సమయంలో కూడా ఇలా నొప్పి వస్తుంది. ఇలా అయ్యింది అంటే... మీకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని అర్థం. దీని వల్ల కడుపులో నొప్పి రావడంతో పాటు... వాంతులు, వికారం లాంటి సమస్యలు కూడా వస్తాయి.
stomach pain
కొందరు ఆహారం చాలా ఎక్కువగా తిన్నప్పుడు కూడా కడుపులో నొప్పి రావడానికి కారణం అవుతుంది. అతిగా తినడం వల్ల పొట్ట దాని సహజ సామర్థ్యానికి మించి విస్తరిస్తుంది. ఇది నొప్పి, గ్యాస్, అసౌకర్యం , వాపు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆహారం తిన్న తర్వాత కడుపులో నొప్పి వస్తే మీకు పెప్టిక్ అల్సర్ ఉందని అర్థం. మీరు నొప్పితో పాటు బర్నింగ్ అనుభూతిని అనుభవిస్తే, మీరు కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
కొందరికి ఫుడ్ ఎలర్జీలు ఉంటాయి. కొందరికి కొన్ని ఆహారాలు అసలు పడవు. దాని వల్ల కూడా ఆహారం తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ లాక్టోస్ అసహనం, ఇది పాల ఉత్పత్తుల వినియోగం వల్ల సంభవిస్తుంది. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఆహారం తిన్న తర్వాత కడుపు నొప్పిని అనుభవిస్తారు.