చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్... రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది..? వీటిని ఎలా తినాలి?

First Published | Jun 26, 2024, 10:12 AM IST

మన ఆరోగ్యానికి అవసరమయ్యే బ్యాలెన్స్డ్ డైట్ కి అదనపు పోషకాలను ఈ రెండూ అందిస్తాయి. కానీ.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
 

chia seeds Flaxseeds

ఈ మధ్యకాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల కాస్త దృష్టి పెరిగిందనే చెప్పొచ్చు. అందుకే.... ఎప్పుడూ అన్నం, కూరలే కాకుండా.. నట్స్, సీడ్స్  ని కూడా తమ భోజనంలో భాగం చేసుకుంటున్నారు. వాటిల్లో ఈ మధ్యకాలంలో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. వీటిని రోజువారి డైట్ లో భాగం చేసుకోవడం వల్ల.... చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చాలా మంది చెబుతుంటే మీరు వినే ఉంటారు. కానీ.. ఈ రెండింటిలో ఏది మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది..? ఏది తీసుకోవడం ఉత్తమం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

flax seed or chia seed

చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్.. రెండింటిలోనూ న్యూట్రియంట్స్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్  పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి అవసరమయ్యే బ్యాలెన్స్డ్ డైట్ కి అదనపు పోషకాలను ఈ రెండూ అందిస్తాయి. కానీ.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


1.చియా సీడ్స్..
 చియా సీడ్స్  చూడటానికి చిన్నగా ఉంటాయి. నల్లగా, తెలుపు రంగులో ఉంటాయి. ఈ చియా సీడ్స్ లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్,  కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం వంటి  విటమిన్స్ ఉంటాయి.
 

ఇక చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల...  మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ రెగ్యులేట్ చేయడానికి సహాయపడతాయి. ప్లాంట్ బేస్డ్ ప్రటోీన్, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి.. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.  కొలిస్ట్రాల్ లెవల్స్ తగ్గించేస్తాయి. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి... దీనిని తీసుకోవడం వల్ల...  కడుపు ఫుల్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది. క్యాలరీ ఇన్ టేక్ తక్కువగా ఉంటుంది. షుగర్ క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి. అంతేకాదు...  చియా సీడ్స్ లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.  వీటిని తినడం వల్ల.. ఎముకలు, దంతాలు బలంగా మారతాయి.

ఇక చియా సీడ్స్ ని ఎలా తీసుకోవాలి అంటే.. ఒక స్పూన్ చియా సీడ్స్ ని నీటిలో వేయాలి. ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసి.. ఆ వాటర్ తాగితే సరిపోతుంది. లేదంటే.. నానపెట్టిన చియా సీడ్స్ ని.. స్మూతీలో కలుపుకొని అయినా తీసుకోవచ్చు.


2.ఫ్లాక్స్ సీడ్స్..
ఇక ఫ్లాక్స్ సీడ్స్ విషయానికి వస్తే.. వీటిలోనూ ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్,  యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు, విటమిన్స్, మినరల్స్, విటమిన్ బి1 పుష్కలంగా ఉంటాయి. ప్లాక్స్ సీడ్స్ ని తీసుకోవడం వల్ల  గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్యాన్సర్ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడటంలో సహాయపడుతుంది. మంచిగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి సహాయపడుతుంది. అంతేకాదు.. అధిక బరువు పెరగకుండా.. బరువు మేనేజ్ అవ్వాలని అనుకునేవారు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవల్స్  కంట్రోల్ లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. దీనిలో కార్బో హైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. తెలియకుండా... చర్మం అందంగా కనపడేలా సహాయపడుతుంది.

రెండింటిలో ఏది తీసుకోవాలి అంటే.. రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  రెండింటిలోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి.. వాటిని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం.

click me!