ఈ డ్రై ఫ్రూట్స్ ని నానపెట్టి మాత్రమే ఎందుకు తినాలి..?

First Published | Jun 17, 2022, 1:34 PM IST

నట్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా తినవద్దు అని వైద్యులు చెబితే తప్ప.. మిగిలిన వారంతా.. కచ్చితంగా వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
 

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ విషయం మనకు బాగా తెలుసు. అయితే.. అన్ని డ్రై ఫ్రూట్స్ ని మామూలుగా తినేయకూడదు. బాదం పప్పు, వాల్ నట్స్, గుమ్మడి గింజలు లాంటి వాటిని రాత్రిపూట నీటిలో నానపెట్టి.. ఉదయాన్నే తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు మనకు చెబుతూ ఉంటారు. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ ని ఎందుకు నానపెట్టి తినాలి..?  వీటిని ఎంత పరిమాణంలో తీసుకోవాలి..? దీనికి గల కారణాలను నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

నట్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా తినవద్దు అని వైద్యులు చెబితే తప్ప.. మిగిలిన వారంతా.. కచ్చితంగా వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Latest Videos


ఈ నట్స్ ని అల్పాహార సమయంలో తీసుకోమని వైద్యులు మనకు చెబుతూ ఉంటారు.  నట్స్ లో విటమిన్ ఇ, కాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం , రైబోఫ్లేవిన్ లు  పుష్కలంగా ఉన్నాయి. వాటిలో ఐరన్, పొటాషియం, జింక్ , బి విటమిన్లు, నియాసిన్, థయామిన్ ,ఫోలేట్ కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ప్రతిరోజూ వాటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలం

అయితే.. ఈ నట్స్ లో  ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు.. ప్రోటీన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

జీర్ణ సామర్థ్యం ఉన్నవారు, రోజూ వ్యాయామం చేసేవారు, తగినంత నీరు త్రాగేవారు , ఎటువంటి వ్యాధి లేనివారు, రోజూ ఒక ఔన్స్ (అరచేతిలో సరిపోయేది) గింజలు తినడం ఆరోగ్యకరం.

వాటిని ఎలా వినియోగించాలి?

ఆయుర్వేదం ప్రకారం, గింజలు మంచి మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు, మాంసకృత్తులు , ఫైబర్‌లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిలో వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వాటిని తిన్నప్పుడల్లా, మీరు వాటిని ఆరు-ఎనిమిది గంటలు నానబెట్టినట్లు నిర్ధారించుకోండి. నానబెట్టడం వల్ల దాని ఉష్నాట (వేడి) తగ్గుతుంది, ఫైటిక్ యాసిడ్/టానిన్‌లను తొలగిస్తుంది, ఇది వాటి నుండి పోషకాహారాన్ని గ్రహించడాన్ని సులభతరం చేస్తుంది. మీరు వాటిని నానబెట్టడం మరచిపోతే, వాటిని పొడిగా కాల్చండి. అలా కాల్చి తినొచ్చు. కానీ పచ్చిగా తినకపోవడమే మంచిది.

almond

ఇక వీటిని ఉదయం అల్పాహారం సమయంలో లేదంటే.. సాయంత్రం... స్నాక్స్ సమయంలో తీసుకోవడం ఉత్తమం. జీర్ణ సంబంధింత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.

click me!