మధుమేహం ఉన్నవారు అరటి పండ్లు తినొచ్చా..?

First Published | Jun 9, 2022, 3:49 PM IST

ముఖ్యంగా పండ్ల విషయంలో ఇలా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. నిజంగా డయాబెటిస్ వచ్చిన వారు పండ్లు తినకూడదా..? ముఖ్యంగా అరటి పండు అస్సలు తినకూడదా..? కానీ డయాబెటిస్ ఉన్న వారు కూడా అరటిపండు తినవచ్చని చెబుతున్నారు వైద్యులు.

ఎలాంటి అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది  అనే నమ్మకం ఉంటుంది కానీ.... మదుమేహం వస్తే మాత్రం జీవితాంతం బాధపడాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే... తొందరగా వదలదు. అవి తినకూడదు.. ఇవి తినకూడదు అని చెబుతూ ఉంటారు.  

ముఖ్యంగా పండ్ల విషయంలో ఇలా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. నిజంగా డయాబెటిస్ వచ్చిన వారు పండ్లు తినకూడదా..? ముఖ్యంగా అరటి పండు అస్సలు తినకూడదా..?


కానీ డయాబెటిస్ ఉన్న వారు కూడా అరటిపండు తినవచ్చని చెబుతున్నారు వైద్యులు. కాకపోతే కొన్ని కండిషన్స్‌తో.. మరి అవేంటో ఓసారి చూద్దాం...

భోజనంతో కలిపి అరటి పండు తినకూడదు. అంటే భోజనం తిన్న వెంటనే అరటి పండు తినడం చేయకూడదు. అన్నంలో అప్పటికే చక్కెర ఉంటుంది, దానికి అరటి పండు కూడా జత చేరితే రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది.

కాబట్టి అన్నం తిన్న రెండు గంటల తరువాత తినవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్ల వరకు తినవచ్చు. అంతకుమించి ఎక్కువ తినడానికి వీల్లేదు.
 

ఈ పండులో ఫ్రక్టోజ్ షుగర్ ఉంటుంది కాబట్టి మితంగానే తీసుకోవాలి. బాగా పండిన, నల్లటి మచ్చలు పడిన అరటి పండ్లు తింటే మంచిది. వాటి ద్వారా పొటాషియం పొటాషియం, ఫైబర్ ల‌భిస్తాయి. ఇవి రెండూ కూడా షుగ‌ర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. 

శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. హైబీపీని తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే మాత్రం అరటి పండ్ల జోలికి వెళ్లకండి. అలాగే రాత్రి పూట ఈ పండ్లను తినకండి. దీనివల్ల షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. 

Latest Videos

click me!