మిగిలిపోయిన పెరుగుతో పన్నీర్... ఎలా చేయాలంటే...?

First Published | Jun 14, 2022, 2:47 PM IST

బాగా కలిపిన ఈ పెరుగును మరుగుతున్న పాలల్లో వేయాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పాలల్లో నీరు పైకి తేలుతూ కనపడుతుంది.  

దాదాపు అందరి ఇళ్లల్లోనూ పెరుగు ఉంటుంది. ప్రతి ఒక్కరూ  భోజనం లాస్ట్ లో పెరుగుతో తినాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో అందరూ పెరుగు తింటారు. అయితే.. మిగిలిపోయిన పెరుగును ఏం చేస్తారు..? మిగలిన పెరుగుతో.. పన్నీర్ చేయవచ్చు తెలుసా..? ఇప్పటి వరకు పాలతో పన్నీర్ చేయవచ్చని మీకు తెలుసు.. కానీ పెరుగుతో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 

సాధారణంగా  పన్నీర్ ని పాలతో చేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే.. పన్నీర్ మనం ఇంట్లోనే పెరుగుతో తయారు చేసుకోవచ్చు.
 


ఇంట్లో తయారుచేసిన పనీర్ చేయడానికి, ఒక లోతైన పాత్రను తీసుకొని 3 కప్పుల పాలు జోడించండి. మీడియం మంట మీద వేడి చేసి మరిగించాలి.తరువాత, 1 1/2 కప్పు మిగిలిపోయిన పెరుగు తీసుకోండి, దానిని బాగా మెత్తటి పేస్టులాగా కలపాలి.

బాగా కలిపిన ఈ పెరుగును మరుగుతున్న పాలల్లో వేయాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పాలల్లో నీరు పైకి తేలుతూ కనపడుతుంది. 

ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దానిలో ఆ  పాలను వేసి.. వడ కట్టాలి. ఆ నీరు మొత్తం పోయేలా వడకట్టాలి. నీరు మొత్తం తొలగించిన తర్వాత.. మిగిలిన మిశ్రమాన్ని.. అదే క్లాత్ లో ఉంచి... దానిపై ఎదైనా బరువు ఉంచాలి. 
 

ఎదైనా బరువైన రాయి ఉంచడం వల్ల.. నీరు మొత్తం బయటకు వస్తుంది. నీరు మొత్తం పోయిన తర్వాత.. దానిని అదేవిధంగా ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఇలా ఫ్రిడ్జ్ లో కనీసం 3 నుంచి 4 గటల పాటు  ఉంచాలి. తర్వాత నచ్చిన ఆకారంలో దానిని ముక్కలుగా కోసుకోవాలి.

పెరుగును గోరువెచ్చని పాలలో చేర్చే ముందు పెరుగుని మొత్తనీ పేస్టులాగా గిలకొట్టాలి. ఆ తర్వాతే పాలల్లో కలపాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.
 

Latest Videos

click me!