Mustard Oil: అమెరికాలో ఆవనూనె వంటకు ఎందుకు వాడరు? మన దగ్గర ఎందుకు ఆ ఆంక్షలు లేవు?

Published : Jun 30, 2026, 04:39 PM IST

 Mustard Oil: భారతీయులు రెగ్యులర్ గా చేసే వంటల్లో ఆవ నూనెను వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఊరగాయలు పెట్టడానికి ఆవ నూనె వాడుతూ ఉంటారు.కానీ, ఓ దేశంలో ఈ ఆవనూనె పై నిషేధం విధించారు.ఎందుకు..? ఈ నూనె మనం ఎందుకు వాడకూడదా? 

PREV
14
Mustard Oil

మనం రెగ్యులర్ గా ఆవ నూనెను వంటల్లో వాడుతూనే ఉంటాం. కానీ, ఇదే ఆవ నూనెను అమెరికాలో నిషేధం విధించారు. అక్కడి మార్కెట్లో అమ్మే ఆవనూనె బాటిల్స్ పై ఈ నూనెను కేవలం సీజనింగ్ కి మాత్రమే వాడాలని క్లియర్ గా రాసి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే ఈ నూనె పై అమెరికా ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించింది? ఈ నూనె వంటకు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదా? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...

24
అసలు కారణం ఇదే...

అమెరికాలో ఆవ నూనె నిషేధానికి ప్రధాన కారణం యూరిక్ యాసిడ్. యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఆవ నూనెలో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. 1970లో జరిపిన పరిశోధనలో, అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల గుండె కండరాల్లో కొవ్వు పేరుకుపోతుందని తెలిపింది. అందుకే.. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఆవ నూనె ఆరోగ్యానికి మంచిది కాదని దానిపై నిషేధం విధించాయి.

34
గుండె జబ్బులు అధికం అవ్వడంతో..

ఆవ నూనె వాడటం వల్ల గుండె జబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తాయో అనే కారణంతో.. ఈ నూనె వాడకంపై ఆంక్షలు విధించినప్పటికీ.. యూనైటెడ్ స్టేట్స్ లో గుండె జబ్బులు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 933,782 మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.

ప్రపంచంలోనే అమెరికాలో గుండె జబ్బుల రేటు అత్యధికంగా ఉండటానికి ప్రధాన కారణం ఆవనూనె వాడకం కాదు. వారి లైఫ్ స్టైలే ప్రధాన కారణం. ముఖ్యంగా వారు తినే ఆహారాల్లో ఫ్యాట్స్, షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఉబకాయం, ధూమపానం, అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే అక్కడ ఆవ నూనె వాడకంపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

44
నిజానికి ఆవ నూనె తీసుకుంటే ఏమౌతుంది..?

నిజానికి ఆవ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా... ఆవ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియాల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే.. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా.. ఆవ నూనెను మితంగా తీసుకుంటే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. కానీ.. ఇప్పటికీ యూఎస్ లాంటి దేశాల్లో.. ఈ ఆవనూనె సలాడ్స్ లో సీజనింగ్ కి లేదంటే... బాడీ మసాజ్ కోసం వాడతారు.

Read more Photos on
click me!

Recommended Stories