టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లో పిస్తాలు ఒకటి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటి ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటిని లిమిట్ లోనే తినాలి. కానీ కొంతమంది వీటిని మోతాదుకు మించి తింటుంటారు. పిస్తాలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, రాగి, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, విటమిన్ బి 6, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిస్తాపప్పు తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇది మన అలసటను, బలహీనతను పోగొడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పిస్తాలను కొంతమంది మాత్రం తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.