రోజుకి ఎన్ని గ్లాసుల నీరు తాగాలి..? ఎక్కువ తాగితే ఏమౌతుంది..?

First Published | May 20, 2024, 4:55 PM IST

మాములుగా  శీతాకాలం, వర్షాకాలంతో పోలిస్తే.... ఎండాకాలంలో శరీరం వాటర్ మరింత ఎక్కువగా కోరుకుంటుంది. అయినప్పటికీ వాటర్ ని విపరీతంగా తాగకూడదు. 


నీరు తాగడం మన శరీరానికి చాలా అవసరం. నీరు తాగితే మన శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాదు.. మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. అయితే.. మరీ ఎక్కువ వాటర్ తాగితే  ఏం అవుతుంది..? అసలు రోజుకి ఎన్ని గ్లాసుల వాటర్ తాగాలి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

మాములుగా  శీతాకాలం, వర్షాకాలంతో పోలిస్తే.... ఎండాకాలంలో శరీరం వాటర్ మరింత ఎక్కువగా కోరుకుంటుంది. అయినప్పటికీ వాటర్ ని విపరీతంగా తాగకూడదు. లేదంటే వాంతులు అవుతాయి. సాధారణంగా, వైద్యులు రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తారు. అయితే అంతకంటే ఎక్కువ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? 


Hydrate

రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ అంతకు మించి నీళ్లు తాగితే కిడ్నీలో హైపర్ ఫిల్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా, ఈ హైపర్‌ఫిల్ట్రేషన్ కొనసాగితే కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతే కాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో ఉప్పు స్థాయి తగ్గి వాంతులు, తల తిరగడం వంటి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.


వైద్యుల ప్రకారం, తక్కువ చెమట పట్టేవారు లేదా ఎక్కువ గంటలు చల్లని వాతావరణంలో పనిచేసేవారు రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీరు మాత్రమే తాగాలి. అయితే చెమట ఎక్కువగా పట్టే వారు, ఒక్క చోట ఆగకుండా పరుగులు తీసే వారు 12 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగొచ్చు.  చెమటలు పెద్దగా పట్టనివారు మరీ ఎక్కువగా నీరు తాగకపోవడమే మంచిది.
 

drinking water


రోజుకు 8 గ్లాసుల కంటే తక్కువ నీరు తాగితే ఏమవుతుంది?: సాధారణంగా శరీరంలోని యూరియా, క్రియాటినిన్, నైట్రోజన్ ఆధారిత వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లేందుకు సహకరిస్తాయంటున్నారు వైద్యులు. కిడ్నీలో రాళ్లు పేరుకుపోతే వాటిని కూడా నలిపి మూత్రం ద్వారా బయటకు పంపుతారు. అందుచేత తక్కువ నీరు తాగితే శరీరంలోని వ్యర్థ పదార్థాల తొలగింపులో అడ్డంకులు ఏర్పడతాయి. ఇది మూత్రంలో రాళ్లు వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి... నీరు తాగేటప్పుడు కూడా కాస్త ఆలోచించాల్సిందే.

Latest Videos

click me!