పన్నీర్ ను ఎవరు తినకూడదు?

First Published | May 17, 2024, 4:54 PM IST

పన్నీర్ తో రకరకాల టేస్టీ టేస్టీ వంటలు చేసి తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి మంచివి కూడా. కానీ కొంతమంది మాత్రం పొరపాటున కూడా పన్నీర్ కర్రీని తినకూడదు. ఎందుకంటే?
 

పన్నీర్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ పన్నీర్ అందరి ఆరోగ్యానికి మంచి చేయదు. అంటే కొంతమంది పన్నీర్ ను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎవరు పన్నీర్ ను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


జీర్ణ సమస్యలు 

జీర్ణ సమస్యలతో బాధపడేవారు పన్నీర్ కు దూరంగా ఉండటమే మంచిది. అవును గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు ఉంటే మీరు పన్నీర్ ను తినకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. అందుకే ఇలాంటి సమస్యలున్నప్పుడు పన్నీర్ కు దూరంగా ఉండండి. 


చర్మ అలెర్జీలు

చర్మ అలెర్జీలు ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటిలో చర్మ అలెర్జీలు ఉన్నవారు కూడా ఉన్నారు. మీకు ఏ రకమైన చర్మ అలెర్జీ  ఉన్నా పన్నీర్ ను తినకండి. అలెర్జీ ప్రతిచర్యను ప్రేరేపించడంలో పనీర్ లక్షణాలు ప్రభావవంతంగా ఉంటాయి. ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.
 

రక్తపోటు సమస్యలు 

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటిలో పన్నీర్ కూడా ఉంది. ఎందుకంటే పన్నీర్ ను ఎక్కువగా తింటే మీ రక్తపోటు బాగా పెరుగుతుంది.

ముడి పన్నీర్ తినొద్దు 

చాలా మంది ముడి పన్నీర్ ను కూడా తింటుంటారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి ప్రాణాంతకంగా మారుతుంది. అవును  ముడి జున్నును తినడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.
 

paneer

గుండె జబ్బులు 

పన్నీర్ లో కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇది మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

డయేరియా సమస్యలు 

పన్నీర్ ప్రోటీన్ కు మంచి మూలం. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు అవుతాయి. అందుకే దీన్ని ఎప్పుడూ కూడా తక్కువ మొత్తంలోనే తీసుకోవాలి. అలాగే పన్నీర్ ను ఎప్పుడూ కూడారాత్రిపూట తినకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. 

Latest Videos

click me!