మండే ఎండల్లో మనకు పెద్దగా ఆహారం తినాలి అనిపించదు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్, ఫ్రై కర్రీలు ఏది తినాలని అనిపించదు. అవి తింటే.. విపరీతంగా దాహం వేస్తుంది. కడుపులో ఏదోలా ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో మనం ఈ సీజన్ కి తగినట్లు కూరగాయలను ఎంచుకోవాలి. మరి.. ఈ మండే ఎండల్లో ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి..? ఏవి తింటే.. ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం..
వేసవిలో సూర్యకాంతి, వేడి , ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కొరత కారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అంతే కాకుండా రోజూ మామూలు నీళ్లు కూడా తాగలేం. అటువంటి పరిస్థితిలో, సమృద్ధిగా నీటిని కలిగి ఉన్న కొన్ని కూరగాయలను తీసుకోవాలి. అవి మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.