తెల్ల ఉల్లిగడ్డను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 17, 2024, 12:45 PM IST

ఉల్లిపాయలు లేకుండా ఏ వంటను చేయరు. అందుకే మన వంటింట్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయలు రెండు రంగుల్లో ఉంటాయి. ఒకటి ఎరుపు రంగులో ఉంటే రెండోది తెలుపు రంగులో ఉంటాయి. అసలు ఈ వైట్ కలర్ ఉల్లిపాయలను తింటే ఏమౌతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు తెలుసా? 


రెడ్ ఉల్లిపాయలను సలాడ్ లేదా కూరల్లో వేసి తింటుంటాం. కానీ వైట్ కలర్ ఉల్లిపాయలను చాలా తక్కువగా వాడుతుంటారు. నిజానికి మనం తెల్ల ఉల్లిపాయలను కూడా రోజూ తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అసలు తెల్ల ఉల్లిపాయలను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గుండె ఆరోగ్యంగా..

తెల్ల ఉల్లిపాయను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్ల ఉల్లిపాయను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. ఇది శరీర మంటను తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటు లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు రాకుండా చూస్తుంది. 
 


శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

తెల్ల ఉల్లిపాయల్లో ఎన్నో రకాల కూలింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఎండాకాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. దీనితో పాటుగా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందుకోసం తెల్ల ఉల్లిపాయను సలాడ్ లేదా కూరలతో పాటుగా ఎన్నో రకాలుగా తినొచ్చు. 
 

మెరుగైన జీర్ణక్రియ

మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా తెల్ల ఉల్లిపాయ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. తెల్ల ఉల్లిపాయను తినడం వల్ల గట్ ఆరోగ్యం మెరుగుపడి జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. దీన్ని తినడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీవక్రియ కూడా పెరుగుతుంది.
 

మంచి నిద్ర 

తెల్ల ఉల్లిపాయల్లో ఎల్-ట్రిప్టోఫాన్ ఉంటుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ఇది మిమ్మల్ని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మన నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తెల్ల ఉల్లిపాయను తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. 
 

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా తెల్ల ఉల్లిపాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి మీ శరీరంలో ఎన్నో వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!