మామిడి పండ్లను ఎవరు తినకూడదు?

First Published May 25, 2024, 3:34 PM IST

ఈ సీజన్ పోయిందంటే మళ్లీ మామిడి పండ్లు దొరకవు. అందుకే చాలా మంది ఈ సీజన్ లో మామిడి పండ్లను తింటూనే ఉంటారు. కానీ మామిడి పండ్లను అందరూ తినకూడదు. అవును కొంతమంది మామిడి పండ్లను తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..


పండ్ల రారాజైన మామిడి మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఈ పండులో ప్రోటీన్, ఫైబర్, సోడియం, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి మామిడిని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే కొంతమందికి ఈ మామిడి విషంలాగే పనిచేస్తుంది. అసలు మామిడి పండ్లను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Image: Getty

స్థూలకాయులు.. 

స్థూలకాయులు మామిడి పండ్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే మామిడి పండులో కేలరీలు చాలా ఉంటాయి. ఇది మీ బరువును మరింత పెంచుతుంది. అలాగే మీ పొట్టను కూడా పెంచుతుంది. అందుకే మీరు ఇప్పటికే ఓవర్ వెయిట్ ఉంటే మామిడి పండ్లను తినడం మానుకోండి. 
 

Image: Getty

డయేరియా సమస్యలు

డయేరియా సమస్యలు ఉన్నవారు కూడా మామిడి పండ్లను తినకపోవడమే మంచిది. మామిడి పండులో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నప్పుడు మామిడి పండ్లను తింటే విరేచనాలు మరింత ఎక్కువ అవుతాయి. 

Image: Getty

డయాబెటిస్.. 

డయాబెటీస్ ఉన్నవారు కూడా మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. వీళ్లు మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. 100 గ్రాముల మామిడిలో 14 శాతం షుగర్ కంటెంట్ ఉంటుంది. మీరు దీనిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 

Image: Getty

మొటిమలు 

మామిడి పండ్లను ఎక్కువగా తింటే మొటిమల సమస్య కూడా బాగా పెరుగుతుంది. మామిడిలో వేడిచేసే గుణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు మామిడి పండును ఎక్కువగా తింటే మొటిమలు బాగా పెరుగుతాయి. 

mango

జీర్ణక్రియ సమస్య

మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే దీన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది. చాలాసార్లు మామిడి పండును ఎక్కువగా తినడం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది. ఇది మీ జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది.

click me!