ఇండియన్స్ పచ్చళ్లను అమితంగా ఇష్టపడతారు. చాలా మందికి అయితే... ఎన్ని రకాల కూరలు ఉన్నా... కొంచెం అయినా పచ్చడి లేకపోతే భోజనం పూర్తవ్వదు. భారతీయ ఇళ్లల్లో చేసే పచ్చళ్లు అమితమైన రుచిని కలిగి ఉంటాయి. సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలా ఈ పచ్చడిని మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇక పచ్చడిలో నూనె కూడా ఎక్కువగా పోస్తూ ఉంటాం. ఎందుకంటే.. ఆ నూనె సరిగా పోస్తేనే పచ్చడి పాడవ్వకుండా ఉంటుంది. అయితే... ఆ పచ్చడిలో పోసిన నూనెను... మనం ఇతర విధాలుగా వాడొచ్చని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేదా కానీ ఇది నిజం. ఈ ఆయిల్ ని ఎలా వాడొచ్చో ఇప్పుడు చూద్దాం...
pickle storage
పచ్చడిలో నూనె లో ఫ్యాట్ ఉంటుంది.. మంచిది కాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ... ఆ ఆయిల్ కూడా ఎంతో ఆరోగ్యకరం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దానికి తోడు పచ్చడిలో మనం చాలా రకాల హెర్బ్స్ కూడా వాడతాం. అవి నూనెలోనూ బాగా కలుస్తాయి. ఫలితంగా.. హానికరమైన ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది.
pickle
పచ్చడి నూనెలో మనకు వెల్లుల్లి, పసుపు లాంటివి కలుస్తాయి. ఇవి మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలను అందిస్తాయి. దీని వల్ల.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా అల్లం, జీలకర్ర లాంటివి కూడా వేస్తాం కాబట్టి.. అవన్నీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.
మీరు నమ్మరు కానీ.... పచ్చడి నూనె మన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొలిస్ట్రాల్ లెవల్స్ ని తగ్గించడంలోనూ సహాయం చేస్తుంది. క్యాన్సర్ లాంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదల కూడా సహాయపడుతుంది.
ఇప్పుడు ఈ నూనెను ఎలా వాడొచ్చో చూద్దాం...
1.సలాడ్ డ్రెస్సింగ్స్..
పచ్చడి నూనెను మనం సలాడ్ డ్రెస్సింగ్ కి కూడా వాడుకోవచ్చు. నార్మల్ గా మనం సలాడ్ ని తయారు చేసినప్పుడు వెనిగర్,హెర్బ్స్ వాడుతూ ఉంటాం. వాటితోపాటు.. ఈ ఫచ్చడి నూనెను కూడా వేయవచ్చు. అది రుచిని పెంచుతుంది. పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
2.ఫ్రైస్...
డీప్ ఫ్రై కాకుండా.. కొంచెం నూనె వేసి మనం కొన్ని రకాల కూరగాయలు, చికెన్ , పన్నీర్ లాంటివి వేయిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో.. ఈ ఫచ్చడి నూనెను వాడొచ్చు. రుచి అద్భుతంగా మారుతుంది.
3.అంతేకాదు... మనం ఆమ్లేట్ వేసుకునేటప్పుడు, లేదంటే.. పాస్తా లాంటివి చేస్తున్నప్పుడు.. ఈ ఆయిల్ వాడొచ్చు. మనం చేసే వంటకు సరికొత్త ఫ్లేవర్ యాడ్ చేసినట్లు అవుతుంది. రుచి చాలా కమ్మగా ఉంటుంది.