రాత్రిపూట ఏయే కూరగాయలు తినొద్దో తెలుసా?

First Published | May 25, 2024, 1:56 PM IST

ఆహారం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే రాత్రిళ్లు మాత్రం కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును రాత్రిపూట కొన్ని కూరలు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
 

Vegetables

రాత్రిపూట తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే మీ నిద్రపై చెడు ప్రభావం పడుతుంది. మరి రాత్రిపూట తినకూడని కొన్ని కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

green peas

పచ్చి బఠానీలు

పచ్చి బఠానీల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పచ్చి బఠానీలను రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే దీన్ని రాత్రిపూట తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల మీరు సరిగ్గా నిద్రపోలేరు. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారు పచ్చిబఠానీలు వేసిన కూరను తినకూడదు. 

Latest Videos


పచ్చి మిరపకాయలు

రాత్రిపూట పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఈ పచ్చిమిరపకాయల ఫ్లేవర్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి ఎసిడిటీ సమస్య వస్తుంది. ఇది మీకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తుంది. 

క్యాబేజీ

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే క్యాబేజీని రాత్రిపూట తినడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే రాత్రిపూట క్యాబేజీని తినకపోవడమే మంచిది.
 

వెల్లుల్లి

రాత్రిపూట వెల్లుల్లిని తింటే కొంతమందికి ఎసిడిటీ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు కూడా రాత్రిపూట వెల్లుల్లి ఎక్కువగా ఉండే వంటకాలకు దూరంగా ఉండాలి.
 

potatoes

బంగాళాదుంపలు

బంగాళాదుంపలతో చేసిన ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని రాత్రిపూట  అస్సలు తినకూడదు. రాత్రిపూట బంగాళాదుంపలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అలాగే నిద్ర సరిగ్గా పట్టదు. 
 

Image: Getty Images

పుట్టగొడుగులు

పుట్టగొడుగులను కూడా రాత్రిపూట తినడం వల్ల కొంతమందిలో గుండెల్లో మంట లేదా అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పుట్టగొడుగులను తినకుండా ఉండాలి.
 

click me!