వీళ్లు చపాతీలను అస్సలు తినకూడదు

First Published | Aug 18, 2024, 9:44 AM IST

ప్రస్తుత కాలంలో అన్నాన్ని తగ్గించి చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. కానీ కొంతమంది మాత్రం చపాతీలకు దూరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? 
 

అన్నం తిన్నా సరే.. చపాతీలను పక్కాగా తింటుంటారు చాలా మంది. ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు పెరగకూడదని కూడా అన్నానికి బదులుగా చపాతీలను తింటున్నారు. నిజానికి చపాతీలు మనకు ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. కానీ గోధుమ పిండితో చేసిన చపాతీలను కొంతమంది తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


అధిక బరువు

చాలా మంది బరువు తగ్గాలని చపాతీలను తింటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక బరువు లేదా ఊబకాయం సమస్యలతో బాధపడేవారు గోధుమ పిండి చపాతీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ బరువును మరింత పెంచుతుందట. 


బలహీనమైన జీర్ణవ్యవస్థ

జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కూడా చపాతీలను తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే గ్యాస్, అజీర్ణం, పుల్లని బర్పింగ్, కడుపు ఉబ్బరం వంటి ఉదర సమస్యలతో బాధపడేవారు గోధుమలతో చేసిన చపాతీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. 

షుగర్ ఉన్నవారు

అవును డయాబెటీస్ పేషెంట్లు కూడా చపాతీలను తినకూడదంటారు నిపుణులు. ఎందుకంటే గోధుమ చపాతీలు రుచిలో కొద్దిగా తియ్యగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు చపాతీని తినకూడదు. 
 

దగ్గు,  జలుబు

కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా చపాతీలను తినకుండా ఉండాలి. ముఖ్యంగా కఫం, జ్వరం, జలుబు, ఫ్లూ వంటి కఫానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్టైతే చపాతీని అస్సలు తినకండి. ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. 

గోధుమలకు బదులుగా మల్టీగ్రెయిన్ రోటీ 

గోధుమ పిండికి బదులుగా మీరు సజ్జలు, మొక్కజొన్న, బార్లీ, జొన్న, రాగులు వంటి చాలా రకాల పిండితో తయారు చేసిన చపాతీని తినొచ్చు. దీన్ని మల్టీగ్రెయిన్ రోటీ అంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

మల్టీగ్రెయిన్ రోటీ  ప్రయోజనాలు 

మల్టీగ్రెయిన్ రోటీ మెటబాలిజాన్ని పెంచుతుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ రోటీ మన జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. దీన్ని తింటే జీవక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అయితే బరువు పెరగాలనుకుంటున్న వారికి గోధుమ పిండితో చేసిన చపాతీ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

Latest Videos

click me!