భోజనం తర్వాత బెల్లం తింటే ఏమౌతుంది..?

First Published | Aug 17, 2024, 4:19 PM IST

ఒకప్పుడు పూర్వీకులు.. తాము భోజనం చేసిన తర్వాత.. కచ్చితంగా బెల్లం తినేవారు. అసలు.. అలా తినడం వల్ల ఏమౌతుంది. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క.. మన ఆరోగ్యంపై ఎంత మేర ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం...

చాలా మందికి భోజనం తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అలా తింటే తప్ప.. వారికి భోజనం పూర్తి చేసిన అనుభూతి కలగదు. అయితే... షుగర్ ఉండే ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అనుకునేవారు.. ఆ ప్లేస్ లో.. బెల్లం చేర్చితే సరిపోతుంది.  ఒకప్పుడు పూర్వీకులు.. తాము భోజనం చేసిన తర్వాత.. కచ్చితంగా బెల్లం తినేవారు. అసలు.. అలా తినడం వల్ల ఏమౌతుంది. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క.. మన ఆరోగ్యంపై ఎంత మేర ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం...
 

Sugarcane jaggery

జీర్ణక్రియకు చాలా మంచిది : భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి.  దీని కారణంగా, ఆహారం సులభంగా విచ్ఛిన్నమవుతుంది. త్వరగా జీర్ణమవుతుంది.
 


jaggery

యాంటీ ఆక్సిడెంట్ రిచ్: బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 

 జీవక్రియను పెంచుతుంది: భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల శరీరంలోని జీవక్రియ వేగంగా,  బలంగా మారుతుంది. ఇది బరువు నియంత్రణను సులభతరం చేస్తుంది.


డిటాక్సిఫైయర్: బెల్లంలో సహజసిద్ధమైన నిర్విషీకరణ గుణాలు ఉన్నాయి. ఇది మన శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
 

రక్తహీనతకు మంచిది: బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళలు , పిల్లలకు ఇది మంచిది.

మలబద్ధకం నుండి ఉపశమనం: మీరు దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలతో బాధపడుతుంటే, క్రమం తప్పకుండా బెల్లం తినండి. 

jaggery

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున, ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

Latest Videos

click me!