పూరీలు తక్కువ నూనె పీల్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Aug 17, 2024, 2:09 PM IST

మనం చేసే ఒక్కో పూరీలో టీ స్పూన్ లేదా సగం టీ స్పూన్ నూనె ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ నూనె ఉన్న పూరీలు తినాలనిపించదు. వీటిని తింటే వేరే ఏమీ తినలేం. అందుకే పూరీలు ఎక్కువ నూనె పీల్చుకోకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పండగల సీజన్ మొదలైంది. ఒక పండుగ తర్వాత ఒక పండుగ వస్తూనే ఉంటుంది. అయితే ప్రతి పండగకు ఇంట్లో పక్కాగా పూరీలను చేస్తుంటారు. కానీ ఈ పూరీలు నూనెను బాగా పీల్చుకుంటాయి. దీంతో పూరీలు నూనెతో నిండిపోతాయి. ఇలాంటి పూరీలను ఎక్కువగా తినలేం. టేస్ట్ కూడా అంతగా ఉండదు. అయితే చాలా మంది పూరీలకు ఉన్న నూనెను టీష్యూలతో తీసేస్తుంటారు. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకోకుండా ఉంటాయి. అవేంటంటే? 

పూరీ పిండిని కలిపేటప్పుడు దాంట్లో కొంచెం శెనగపిండిని వేసి కలపండి. దీనివల్ల పూరీలు క్రిస్పీగా వస్తాయి. అలాగే నూనె కూడా తక్కువగా పీల్చుకుంటుంది. అలాగే పూరీలను వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె తక్కువ వేడిగా ఉన్నప్పుడు పూరీలను వేసి కాల్చితే అవి ఉబ్బకుండా ఉంటాయి. అలాగే నూనెను కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. 



పూరీలను ఎప్పుడూ కూడా రెండు ఫ్లిప్ లలో కాల్చుకోవాలి. ముందుగా ఒక వైపు బంగారు రంగు వచ్చే వరకు వేయించి, ఆ తర్వాత వేరే సైడు తిప్పి మరో వైపు బంగారు రంగులోకి వచ్చే వరకు చూడాలి. ఇలా రాగానే నూనెలోంచి తీయాలి. దీనివల్ల పూరీలు నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా, క్రిస్పీగా వస్తాయి.

ఇకపోతే పూరీ పిండిని రోలింగ్ చేసేటప్పుడు ఎక్కువగా పల్చగా చేయకూడదు. కొంచెం మందం ఉంటే పూరీ బాగా ఉబ్బి ఎక్కువ నూనెను పీల్చుకోదు. పూరీ పిండిని కలిపిన తర్వాత పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తర్వాత పూరీలను తయారుచేయండి. పూరీలు మెత్తగా, నూనె పీల్చుకోకుండా రావాలంటే...పిండిని మెత్తగా కలపాలి. దీంతో పూరీ రోలింగ్ చేసేటప్పుడు పొడి పిండి లేదా ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం ఉండదు. 

Latest Videos

click me!