నెయ్యి ఎవరు తినకూడదు..?

First Published | Dec 24, 2024, 2:32 PM IST

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. ఇంత మంచిది అయినా.. కొందరు మాత్రం అస్సలు తినకూడదు. ముఖ్యంగా పరగడుపున మాత్రం తినకూడదు. మరి, ఎవరు తినకూడదో తెలుసుకుందాం...

నెయ్యి ఎంత ఆరోగ్యకరమో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెయ్యిలో హెల్దీ ప్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. నెయ్యిలో మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, మంచి ఫ్యాటీ యాసిడ్స్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ప్రతిరోజూ భోజనంలో నెయ్యి భాగం చేసుకోవాలని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు.

ఆయుర్వేదంలోనూ నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది మీ హృదయ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఖాళీ కడుపుతో నెయ్యి

ఖాళీ కడుపుతో నెయ్యి తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి, హృదయం ఆరోగ్యంగా ఉంటుంది, కంటి ఆరోగ్యానికి మంచిది. ఇది కాకుండా, మెదడు, జ్ఞాపకశక్తి మొదలైన వాటికి కూడా నెయ్యి ప్రయోజనకరం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ కడుపుతో నెయ్యి తినడం అందరికీ మంచిది కాదు. శరీరంలో కొన్ని సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నెయ్యి తింటే, అది ప్రయోజనం కంటే హాని చేస్తుంది. ఎవరెవరో ఇక్కడ చూడవచ్చు.


నెయ్యిని ఎవరు తినకూడదు

ఖాళీ కడుపుతో నెయ్యి ఎవరు తినకూడదు:

పాల అలెర్జీ ఉన్నవారు...

కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులు తింటే అలెర్జీ వస్తుంది. అలాంటివారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదు. తింటే వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

గుండె సమస్య ఉన్నవారు...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే, అందులోని కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా నెయ్యిలో ఉండే అధిక కొవ్వు ఆమ్లాలు గుండెలోని రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కాబట్టి, గుండె సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదు.

నెయ్యి ప్రమాదాలు, జాగ్రత్తలు

కాలేయ సమస్య ఉన్నవారు...

మీకు ఇప్పటికే కాలేయ సమస్య ఉంటే, మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం మానుకోవాలి. లేదంటే, సమస్య తీవ్రమవుతుంది.

అధిక బరువు ఉన్నవారు...

మీ బరువు తగ్గించుకోవడానికి మీరు డైట్‌లో ఉన్నప్పుడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోకూడదు. మీరు భోజనంతో పాటు రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే నెయ్యి తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీ బరువు పెరుగుతుందని గుర్తుంచుకోండి.

నెయ్యి దుష్ప్రభావాలు

గర్భిణులు...

గర్భధారణ సమయంలో మహిళలు ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదు. ఎందుకంటే సాధారణంగా గర్భధారణ సమయంలో మలబద్ధకం, అజీర్తి, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. నెయ్యి తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది.

కడుపు సమస్య ఉన్నవారు..

నెయ్యి జీర్ణవ్యవస్థకు మంచిదే అయినప్పటికీ, మీరు తరచుగా జీర్ణ, కడుపు సమస్యలతో బాధపడుతుంటే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదు.

Latest Videos

click me!