సీజన్ కు తగ్గట్టు మన ఆహారపు అలవాట్లను ఖచ్చితంగా మార్చుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా చలికాలంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
చలికాలంలో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలనే తినాలి. ఈ సీజన్ లో మార్కెట్ లో రకరకాల కూరగాయలు దొరుకుతాయి. ఇవన్నీ మన రోజువారి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. సీజనల్ కూరగాయల్లో విటమిన్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కూరగాయల్లో క్యారెట్లు ఒకటి. నిజానికి క్యారెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా, వారంలో మూడు నాలుగు సార్లు వండుకుని తింటుంటారు.
క్యారెట్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ.. వీటిని కొంతమంది మాత్రం అస్సలు తినకూడదు. అవును ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. కొంతమంది మాత్రం తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎవరు చలికాలంలో క్యారెట్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చలికాలంలో క్యారెట్ ను ఎవరు తినకూడదు
కడుపు సమస్యలున్న వారు
కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు చలికాలంలో క్యారెట్లను అస్సలు తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కడుపులో ఏదైన సమస్య ఉన్నవారు క్యారెట్లను తింటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్యారెట్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపునకు మంచిది కాదు. ఒకవేళ ఈ సీజన్ లో క్యారెట్లను తిన్నా తక్కువగా తినాలి. లేదంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారు
డయాబెటీస్ పేషెంట్లు చలికాలంలో క్యారెట్లను తినకపోవడమే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే క్యారెట్లలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అందుకే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే వీళ్లు క్యారెట్లను తినాలి.
అలెర్జీ సమస్యలున్నవారు
చర్మ అలెర్జీ ఉన్నవారు కూడా క్యారెట్లను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొంతమందికి క్యారెట్లను తిన్నా అలెర్జీ వస్తుంది. దీనివల్ల శరీరంపై దద్దుర్లు ఏర్పడటం, దురద పెట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ మీకు కూడా ఈ సమస్య ఉంటే క్యారెట్లను తినకపోవడమే మంచిది. వీళ్లు క్యారెట్లను ఎప్పుడూ కూడా ఎక్కువగా తినకూడదు.
పాలిచ్చే తల్లులు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పాలిచ్చే తల్లులు కూడా క్యారెట్లను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే క్యారెట్లను ఎక్కువగా తింటే తల్లిపాల రుచి మారుతుందట. అలాగే దీనివల్ల తల్లికి, బిడ్డకు సమస్యలు కూడా వస్తాయట.
నిద్రలేమి సమస్యలున్నవారు:
నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.దీనివల్ల వీరు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేరు. ఇలాంటి వారు కూడా క్యారెట్లను ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్యారెట్లలోని పసుపు భాగం వేడిగా ఉంటుంది. ఇది మన కడుపులోకి వెల్లగానే కడుపులో మంట కలుగుతుంది. దీంతో మీకు నిద్రపట్టదు. అందుకే మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే దీన్ని చలికాలంలో తక్కువగా తినాలి.