diabetes diet
డయాబెటిస్ లేదా షుగర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ డయాబెటీస్ రెండు రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్ , 2 టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ రావడాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఈ వంశపారంపర్యంగా వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ జీవనశైలి వల్ల వస్తుంది. మన జీవనశైలిని మెరుగ్గా ఉంచుకుంటే ఈ వ్యాధి బారిన పడే అవకాశం తప్పుతుంది.
diabetes diet
ప్రస్తుత కాలంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడ్డారంటే.. జీవితాంతం ఈ వ్యాధితోనే ఉండాలి. ఎందుకంటే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం. కానీ మందులు, జీవనశైలి మార్పులతో ఈ వ్యాధిని నియంత్రించొచ్చు. జీవనశైలి విషయానికొస్తే ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు కొన్ని ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. అవేంటంటే?
అల్లం
షుగర్ పేషెంట్లు తప్పక తినాల్సిన ఆహారాల్లో అల్లం ఒకటి. చాలా కూరల్లో అల్లాన్ని వేస్తాం. అయితే వీళ్లు అల్లం టీ, జ్యూస్ లను తాగడం మంచిది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్లాన్ని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని అధ్యయనాలు అల్లం మన చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నాయి. దీనికి అల్లంలో ఉండే 'జింజెరోల్' అనే సమ్మేళనం దీనికి తోడ్పడుతుంది.
Garlic
వెల్లుల్లి
అల్లం మాదిరిగానే వెల్లుల్లిని కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చు. వెల్లుల్లి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీనికి వెల్లుల్లిలోని 'అల్లిసిన్' అనే సమ్మేళనం సహాయపడుతుంది.
దాల్చిన చెక్క
మనం సాధారణంగా వాడే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. ఈ మసాలా దినుసు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా దాల్చినచెక్కను ఉపయోగించడం ప్రయోజకరంగా ఉంటుంది. ఇది డయాబెటీస్ ను నియంత్రిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
లవంగాలు
లవంగాలు కూడా షుగర్ పేషెంట్లకు మంచి మేలు చేస్తాయి. ఈ మసాలా దినుసుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది.
fenugreek
మెంతులు
మెంతులు మధుమేహులకు ఔషదంలాగే పనిచేస్తాయి. వీటిని వీళ్లు తప్పకుండా తినాలి. మెంతుల్లోని ఫైబర్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది.
పసుపు
పసుపు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన పదార్థమన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. పసుపు ఇన్సులిన్ హార్మోన్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. వీటన్నింటికీ పసుపులోని 'కర్కుమిన్' అనే పదార్ధం తోడ్పడుతుంది.