బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్ ప్రియులు తమ ఆహారంలో తరచూ మార్పులు చేస్తుంటారు. ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలను తింటారు. మొలకెత్తిన బీన్స్ అధిక విటమిన్ , మినరల్ కంటెంట్ కారణంగా పోషక శక్తిగా పరిగణిస్తారు. అవి ముఖ్యంగా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్ సి , కె అధికంగా ఉండటం వల్ల మొలకలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది , రోజంతా నిండుగా ఉంచుతుంది.