గుడ్డు వర్సెస్ పనీర్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

First Published | Feb 17, 2024, 3:42 PM IST

గుడ్లు, పనీర్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్ ను అందిస్తుందని చాలా మందికి డౌట్ వస్తుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

egg paneer

శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తగినంత ప్రోటీన్ ను తీసుకోవడం చాలా ముఖ్యం. పోషక ఆహారాలు చాలానే ఉన్నాయి. గుడ్లు, పనీర్ కూడా ప్రోటీన్ ఫుడ్ లో భాగమే. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది? లేదా ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? అన్న విషయంలో చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మరి ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గుడ్డు

గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో సుమారుగా 6 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. గుడ్డుతో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లు అందుతాయి. అయితే దీనిలో కొవ్వు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇది దీనిని శీతాకాలంలో తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెప్తారు. గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కోడి గుడ్డులో మొత్తం కొవ్వు 4 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 1 మి.గ్రా ఐరన్, 25 మి.గ్రా కాల్షియం కంటెంట్ ఉంటుంది. అయితే మీరు రోజుకు ఎన్ని గుడ్లు తినాలనేది మీ వయస్సు, బరువు, మీ దినచర్యపై ఆధారపడి ఉంటుంది. దీన్ని డైటీషియన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. 

Latest Videos


paneer

పనీర్

40 గ్రాముల పనీర్ లో 7 గ్రాముల ప్రోటీన్, 190 మిల్లీ గ్రాముల కాల్షియం, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఉంటాయి. గుడ్ల మాదిరిగానే చాలా మంది దీన్ని ఎన్నో వంటల రూపంలో తింటారు. ముఖ్యంగా దీన్ని శాఖాహారులు ఎక్కువగా తింటారు.  గుడ్లతో పోలిస్తే ఇది కాస్త ఖరీదైనది.
 

egg paneer

ఈ రెండింటిలో ఏది తినడం మంచిది?

గుడ్లు, పనీర్ రెండూ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు గుడ్లను తినకపోతే పనీర్ ద్వారా మీ శరీరానికి కావాల్సిన పోషకాలను పొందొచ్చు. గుడ్లతో పోలిస్తే ఇది కాస్త ఖరీదైనదే అయినా ఇందులో కల్తీ జరిగే ప్రమాదం కూడా ఎక్కువే. అందుకే మీరు ఎక్కడ నుంచి కొంటున్నారో తెలుసుకోండి. కల్తీ కాకుండా చూసుకోండి. అంతేకాకుండా మీరు రెండింటిలో దేనినైనా తినొచ్చు.
 

click me!