బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఏ ఉప్పు తినాలి..?

First Published | Jul 12, 2024, 9:53 AM IST

మనం ఎంత అద్భుతంగా వంట చేసినా  ఆ కూరలో ఉప్పు లేకపోతే.. దానికి ఎలాంటి రుచి ఉండదు. మనకు అంత రుచిని అందించే ఉప్పు తో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి

ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ సమస్యతో బాధపడుతున్నారనే చెప్పొచ్చు. బీపీ రావడానికి వయసుతో సంబంధం లేదు అన్నట్లుగా మారిపోయింది.  కనీసం 25ఏళ్లు నిండకుండానే  బీపీ వచ్చేస్తోందని, ఉప్పు తగ్గించేస్తూ తినాలి అని తెగ కంగారుపుడుతూ ఉంటారు. అయితే... బీపీ రాగానే ఉప్పు మానేయాల్సిన అవసరం లేదట.  మనం తీసుకునే ఉప్పు విషయంలో  కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలాట. అంటే.. మనకు మార్కెట్లో చాలా రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి.  ఏ ఉప్పు తీసుకుంటే.. ఈ హైబీపీ ప్రాబ్లం ఉండదు అనే విషయం ఒక్కటి తెలుసుకుంటే చాలు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం...

మనం ఎంత అద్భుతంగా వంట చేసినా  ఆ కూరలో ఉప్పు లేకపోతే.. దానికి ఎలాంటి రుచి ఉండదు. మనకు అంత రుచిని అందించే ఉప్పు తో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  అయితే.. మనం హైబీపీ ఉంది అని భయపడే బదులు... ఆరోగ్యకరమైన ఉప్పును ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయోడిన్ సాల్ట్, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లాంటివి చాలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  ఏది బీపీ ఉన్నవారికి మంచిదో తెలుసుకోవడం అవసరం.
 

Latest Videos


1.టేబుల్ సాల్ట్..
దీనిని మనం జనరల్ గా వాడుతూ ఉంటాం. కామన్ గా అందరు ఇళ్లల్లో ఉపయోగించే ఉప్పు ఇది. ఈ ఉప్పులో మనకు సోడియం క్లోరైడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఇది ఎక్కువగా తినడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ అనేది కాస్త తొందరగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఇలాంటి ఉప్పును వీలైనంత వరకు చాలా తక్కువగా, తగ్గిస్తూ తీసుకోవాలి. మనకు బయట దొరికే చాలా రకాల బేకరీ ఫుడ్స్ లోనూ ఇలాంటి ఉప్పే వాడతారు. సోడియం ఎక్కువగా ఉండటం  ఈ ఫుడ్స్ మనకు ప్రమాదకరంగా మారతాయి.
 

2.సీ సాల్ట్..
మనం ఈ ఉప్పును ఎంచుకోవచ్చు. ఎందుకంటే.. సముద్రపు నీటి నుంచి డైరెక్ట్ గా తయారయ్యే ఈ ఉప్పులో మనకు కంటికి కనిపించని చాలా మినరల్స్ దాగి ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఈ సీ సాల్ట్ లో.. మనకు సోడియం లెవల్స్ కాస్త తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. టేబుల్ సాల్ట్ కీ, ఈ సీ సాల్ట్ కీ తేడా మినరల్స్ మాత్రమే. ఈ ఉప్పును మనం తినొచ్చు. అయితే.. మరీ ఎక్కువగా కాకుండా.. మితంగా తీసుకుంటే. హై బీపీ ప్రాబ్లం ఉండదు.
 

See what benefits this Pink Salt can have


3.హిమాలయన్ పింక్ సాల్ట్...
హై బీపీ ఉన్నవారు.. ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే.. మినరల్స్  చాలా  పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షింయ లాంటివి ఉంటాయి. ఈ ఉప్పు మనకు చూడటానికి కూడా పింక్ కలర్ లో ఉంటుంది. హై బీపీ ఉన్నవారు కూడా ఈ పింక్ సాల్ట్ హ్యాపీగా తినొచ్చు. సోడియం తక్కువగా ఉంటుంది.

కాబట్టి...  హిమాలయన్ పింక్ సాల్ట్, సీ సాల్ట్  లాంటి వాటిని ఎంచుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. పచ్చళ్లు, ఊరగాయలు లాంటి వాటికి కూడా కాస్త వీలైనంత దూరంగా ఉండట మంచిది.

click me!