గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మన శరీరాన్ని బలంగా చేస్తాయి. అలాగే కండరాల మరమ్మత్తుకు, కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్లలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి, గుండెను హెల్తీగా ఉంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. అందుకే చాలా మంది గుడ్లను తింటుంటారు.
అయితే రెగ్యులర్ గా ఒకే రకమైన ఫుడ్ ను తినడం కాస్త బోరింగ్ నే ఉంటుంది.అందుకే చాలా మంది ఒక రోజు ఉడకబెట్టిన గుడ్డును తింటే మరొక రోజు ఆమ్లేట్, ఎగ్ కర్రీ అంటూ రకరకాలుగా చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆమ్లేట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే కొందరు గుడ్లను ఉడకబెట్టి మసాలా చేసి తినడానికి బాగా ఇష్టపడతారు. చాలా మంది ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్లనే తింటారు. అయితే ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్లలో ఏది ఆరోగ్యానికి మంచిదో అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ ఆర్టికల్ ద్వారా ఏది ఎక్కువ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉడకబెట్టిన గుడ్ల ప్రయోజనాలు
ఉడకబెట్టిన గుడ్లలో ఆమ్లెట్ల కంటే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.
గుడ్లను ఉడకబెట్టడం చాలా సులువు. అలాగే ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో మీరు గుడ్ల పోషకాలను పొందుతారు.
ఉడకబెట్టిన గుడ్లలో ఆమ్లెట్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. ఎందుకంటే దీని కోసం మీరు నూనెను ఉపయోగించరు.
ఆమ్లెట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఆమ్లెట్ లో రకరకాల కూరగాయలు, మసాలా దినుసులను వేయొచ్చు. దీంతో ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది.
ఆమ్లెట్ లో కూరగాయలు, ఇతర పదార్థాలను కలపడం వల్ల ఆమ్లెట్ లో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. దీంతో మీకు ఎక్కువ సేపు ఆకలి వేయదు.
ఆమ్లెట్ ను తయారు చేసేటప్పుడు అవొకాడో, ఆలివ్ ఆయిల్ లేదా నట్స్ మొదలైనవి చేర్చుకుంటే మీకు ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ లో ఏది తినాలి?
ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్లు రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ మీరు తక్కువ కేలరీలున్నదే తినాలంటే మాత్రం ఉడికించిన గుడ్లే బెస్ట్. అలాగే కేలరీలు ఎక్కువగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఆమ్లెట్ ను తినొచ్చు.