డయాబెటీస్ ఉన్నవాళ్లు ఏ పండ్లు తినాలి?

First Published | Mar 13, 2024, 10:01 AM IST

డయాబెటీస్ కూడా ప్రమాదకరమైన వ్యాధే. దీన్ని ఏ మాత్రం పట్టించుకోకపోయినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండేట్టు చూసుకోవాలి. అయితే కొన్ని రకాల పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటంటే?
 

ఒకప్పుడు డయాబెటీస్ అంటే భయపడిపోయేవారు. ఇప్పుడు కామన్ వ్యాధిగా మారిపోయింది. చెడు ఆహారాలు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్లే ఈ వ్యాధి వస్తుంది. కానీ ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఇక మనం చనిపోయేంత వరకు ఉంటుంది. దీనిని శాశ్వతంగా తగ్గించుకోలేము. కేవలం దీనిని కంట్రోల్ చేయగలం అంతే. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్లు కొన్ని అలవాట్లతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. 

diabetes

రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను మీ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను తింటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. 

Latest Videos


ఈ పండ్లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడమే కాకుండా మీరు హెల్తీగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అలాగే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మీ శరీర శక్తి స్థాయిలను పెంచుతాయి. ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు తినాల్సిన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Diabetes Diet

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి?

గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎంత కాలం లేదా ఎంత త్వరగా గ్లూకోజ్ గా మార్చబడుతుందో చెప్పే కొలత. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర మొత్తాన్ని పెంచవు. దీన్నే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు.

చెర్రీలు

చెర్రీ పండ్లలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చెర్రీ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 20 మాత్రమే ఉంటుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర పెరిగే అవకాశమే ఉండదు. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. అంతేకాదు ఈ పండు ఎన్నో అనారోగ్య సమస్యలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. 
 

Fruits

ఆపిల్ పండు

ఆపిల్స్ ను తింటే హాస్పటల్ కు వెళ్లే అవకాశమే ఉండదని చెప్తుంటారు ఆరోగ్య నిపుణులు. అవును ఆపిల్ పండ్లు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఆపిల్స్ లో కాల్షియం, విటమిన్లతో పాటుగా ఎన్నో రకాల ఇతర పోషకాలు ఉంటాయి. ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ 39. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాదు ఈ పండు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. 

Fruits

అరటి

అరటిపండు కూడా మంచి పోషకాహారం. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 గా ఉంటుంది. ఈ పండు కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తింటే రక్తపోటు తగ్గడంతో పాటుగా ఆస్తమా, క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. అయితే డయాబెటీస్ ఉంటే ఎక్కువగా పండిన అరటిపండ్లను తినొద్దు. ఎక్కువ కూడా తినొద్దు. 
 

Fruits

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ 54 గా ఉంటుంది. ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఈ పండు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

Fruits

ఈ పండ్లే కాకుండా మీరు కొన్ని రకాల పండ్లను కూడా తినొచ్చు. ద్రాక్షలో  గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) 53, ఆరెంజ్ జిఐ 40, స్ట్రాబెర్రీ జిఐ 40, , పియర్ జిఐ 38 ఉంటుంది. ఇవి కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లే కాబట్టి వీటిని కూడా తినొచ్చు. ఇవి కూడా డయాబెటీస్ ను కంట్రలో చేస్తాయి. 

click me!