హెవీగా తినకపోయినా బరువు పెరుగుతున్నారా..? కారణం ఇదే..!

First Published Mar 11, 2024, 2:26 PM IST

నిజానికి మనం హెవీగా తినకపోయినా... కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగానే  బరువు పెరుగుతూ ఉంటారట. మరి.. ఆ అలవాట్లు ఏంటి..? మనం వేటిని మార్చుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.

Do you know that due to these reasons weight gain


చాలా మంది.. మేము ఏమీ తినడం లేదు అయినా కూడా బరువు పెరిగిపోతున్నాం అని ఫీలౌతూ ఉంటారు. కొందరేమో..తాము చాలా తక్కువ ఆహారం తీసుకుంటామని.. కడుపు నిండా కూడా తినడం లేదు అయినా.. బరువు తగ్గకపోగా.. ఇంకా ఎక్కువ పెరుగుతున్నాం అని వాపోతూ ఉంటారు. అయితే... నిజానికి మనం హెవీగా తినకపోయినా... కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగానే  బరువు పెరుగుతూ ఉంటారట. మరి.. ఆ అలవాట్లు ఏంటి..? మనం వేటిని మార్చుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.

weight gain


1.మన లైఫ్ స్టైల్..
మనం బరువు పెరిగిపోవడానికీ, అదేవిధంగా ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడానికి లైఫ్ స్టైలే కారణం. చాలా మంది ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ... వ్యాయామం చేయడం పూర్తిగా మర్చిపోతారు. అలా వ్యాయామం చేయకుండా ఉండటం వల్ల మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీని వల్ల.. చాలా తొందరగా బరువు పెరిగిపోతూ ఉంటాం. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మొదలుపెడితేనే.. బరువు తగ్గుతారు. ఆఱోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయగలుగుతారు.

sleep

2.నిద్ర అలవాట్లు..
ఆహారం సంగతి పక్కన పెడితే... మంచి నిద్ర లేకపోయినా కూడా బరువు పెరిగిపోతారు. నిద్ర లేకపోతే.. హార్మోనల్ బ్యాలెన్స్  ఏర్పడుతుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల.... క్రేవింగ్స్ పెరిగిపోతాయి. షుగరీ ఫుడ్స్ తినాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. వాటిని తినడం వల్ల.. బరువు సులభంగా పెరిగిపోతాం. కాబట్టి.. మంచి నిద్ర చాలా అవసరం 

stress eating

3.స్ట్రెస్ ఈటింగ్..
మనలో చాలా మంది ఒత్తిడిలో అమితంగా తింటూ ఉంటారు. అయితే.. ఒత్తిడిలో తెలీకుండానే ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దాని వల్ల  మనం ఎక్కువ క్యాలరీలు తీసుకుంటూ ఉంటాం. ఫలితంగా తెలీకుండానే బరువు పెరిగిపోతూ ఉంటాం. దానికి బదులుగా ఒత్తిడిని తగ్గించుకునే పని చేయాలి. దాని కోసం... మెడిటేషన్ చేయం, యోగా లాంటివి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు  ఒత్తిడి తగ్గి.. ఎక్కువగా తినడం లాంటివి తగ్గించుకోగలం.

sugar intake

4. హై షుగర్ ఇన్ టేక్..
ఎక్కువ ఆహారం తినకపోయినా అప్పుడప్పుడు షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ తాగినా కూడా  విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి.... ఈ షుగరీ ఫుడ్స్ కి దూరంగా ఉండటం చాలా అవసరం. అప్పుడే..  మీరు అనుకున్నట్లుగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

5.పోర్షన్..
చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం కదా అని... ఎక్కువ పోర్షన్ తీసుకుంటూ ఉంటారు. దాని వల్ల కూడా క్యాలరీ కౌంట్ పెరిగిపోయి.. బరువు పెరుగుతారు. అలా కాకుండా.. తక్కువ పోర్షన్ ఉండే ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా మైండ్ ఫుల్ గా తీసుకోవాలి.. అప్పుడు క్యాలరీ కంట్రోల్ ఉంటుంది. బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.


6.అనారోగ్యకరమైన స్నాక్స్..
ఇక చాలా మంది ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే.. ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకంటూ ఉంటారు. వీటి వల్ల... డైట్ పూర్తిగా నాశనం అవుతుంది.  బరువు బాగా పెరిగిపోతారు. దానికి బదులు.. పండ్లు, నట్స్, కూరగాయలు తీసుకోవాలి. అప్పుడు.. బరువు మంచిగా మెయింటైన్ అవుతుంది.

7.మైండ్ లెస్ ఈటింగ్..
మనం తీసుకునే ఆహారం మనస్పూర్తిగా తీసుకోవాలి. చాలా మంది టీవీలు చూస్తూ.. ఫోన్లు చూస్తూ తింటూ ఉంటారు. దాని వల్ల ఎంత తింటున్నాం.. ఏం తింటున్నాం అనే విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా బరువు అధికంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. అలా కాకుండా.. పుడ్ తినేటప్పుడు.. ఫుడ్ మాత్రమే తినాలి.

meals

8.మీల్ స్కిప్ చేయడం..
మరి కొందరు.. బరువు తగ్గాలనే పిచ్చిలో మీల్స్ పూర్తిగా స్కిప్ ఛేస్తూ ఉంటారు.  ఒక్క పూట మానేసి... మరోపూట ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. దానికి బదులు... బ్యాలెన్సింగ్ మీల్స్ తీసుకోవాలి. దాని వల్ల... ఎక్కువ క్యాలరీ తీసుకునే అవసరం రాదు. ఫలితంగా బరువు కంట్రోల్ లో ఉంటుంది.

Image: Freepik


9.లిక్విడ్ క్యాలరీలు..
కొందరు కాఫీలు, షుగర్ కలిపిన జ్యూస్, ఆల్కహాల్ వంటివి తాగుతూ ఉంటారు. వాటి వల్ల కూడా బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి... దానికి బదుల హెర్బల్ టీ తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. అప్పుడు సులభంగా బరువు తగ్గుతారు. 

click me!