గోబీ మంచూరియా కూడా ఆరోగ్యానికి మంచిది కాదా..?

First Published Mar 12, 2024, 4:30 PM IST

మరి గోబీ మంచూరియాను ఎందుకు బ్యాన్ చేశారు అనే సందేహం చాలా మందిలో మొదలైంది.

తమిళనాడు ప్రభుత్వం.. రీసెంట్ గా కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలను  బ్యాన్ చేసేసింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాటన్ క్యాండీ అంటే మొత్తం షుగరీ ఫుడ్ దానికి తోడు రంగు రావడం కోసం అందులో కెమికల్స్ కలుపుతారు కాబట్టి... తినకూడదు అన్నారు సరే.. మరి గోబీ మంచూరియాను ఎందుకు బ్యాన్ చేశారు అనే సందేహం చాలా మందిలో మొదలైంది

గోబీ మంచూరియా.. మంచిగా కూరగాయలతో చేసుకునేదే కదా.. అది తినకూడదు అన్నారంటే.. మనం ఇంట్లో చేసుకొని కూడా తినకూడదా అనే డౌట్ వస్తోందా..? అసలు ఎందుకు బ్యాన్ చేశారు..? అసలు తినొచ్చా..? తినకూడదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

మనలో చాలా మందికి వెజ్ లో స్నాక్స్ అంటే ముందుగా వెజ్ మంచూరియానే గుర్తుకువస్తుంది. రోడ్డు పక్కన స్ట్రీట్ మార్కెట్లోనూ చాలా విరివిగా లభిస్తూ ఉంటుంది. అయితే..  ఈసారి నుంచి రోడ్ షైడ్ కనిపించే ఈ గోబీ మంచూరియాకు దూరంగా ఉండటమే మంచిది. నిజానికి గోబీ మంచూరియా ఆరోగ్యానికి కలిగించే నష్టం ఏమీ లేదు. కానీ.. మనకు అది కలర్ ఫుల్ గా కనిపించడానికి అందులో ఉపయోగించే ఫుడ్ కలర్ లోనే అసలు సమస్య మొత్తం మొదలయ్యేది.

బయట అమ్మే మంచూరియా చూడటానికి చాలా ఎర్రగా కలర్ ఫుల్ గా ఉంటుంది. వెంటనే మనల్ని ఆకర్షిస్తుంది. కానీ..ఆ కలర్ లోన పెద్ద మొత్తంలో క్యాన్సర్ కారకాలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
 

gobi manchurian

గోబీ మంచూరియన్ తయారీలో రోడమైన్-బి , టార్ట్రాజైన్ క్యాన్సర్ కారక సంకలితాలను ఉపయోగిస్తున్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. అందుకే ఇప్పుడు వాటిపై నిషేధం విధిస్తున్నారు. ప్రభుత్వ నియమాలను పట్టించుకోకుండా వ్యవహరించిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష. రూ.10వేల జరిమానా విధిస్తాం అని కర్ణాటక ప్రభుత్వం చెప్పింది. 

Gobi Manchurian

అయితే... అక్కడ ఆ కలర్స్ వాడుతున్నారు అంటే.. మనం ప్రదేశాల్లోనూ అదే కలర్ కలుపుతూ ఉండొచ్చు. కాబట్టి.. బయట అమ్మే ఇలాంటి ఫుడ్ కి దూరంగా ఉండటమే మంచిది. మీకు మరీ తినాలని అనిపిస్తే.. ఎలాంటి ఆర్టిఫీషియల్ కలర్స్ లేకుండా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకొని తింటే ఎలాంటి సమస్య ఉండదు అని నిపుణులు చెబుతున్నారు.

click me!