చపాతీ, పూరీ కోసం పిండి కలుపుతున్నారా.. ఇదొక్కటి కలిపితే.. టేస్ట్ అదిరిపోద్ది..!

First Published Jul 26, 2024, 1:39 PM IST

హోటల్స్ లో చేసినట్లు టేస్టు రావాలంటే.. పిండి కలిపేటప్పుడే.. దాంట్లో ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది.

దాదాపు మన సౌత్ ఇండియన్స్ తమ రోజువారి ఆహారంలో ఎక్కువగా అన్నమే తింటారు. కానీ.. అప్పుడప్పుడు చపాతీ, రోటీ, పూరీ, పరాటా లాంటివి తినడానికి కూడా ఇష్టపడతారు. పూరీలు అయితే రెగ్యులర్ గా.. చేసుకునేవాళ్లు కూడా ఉంటారు. అయితే.. బయట హోటల్ లో చేసినట్లు,. రోటీలు, పూరీలు, పరోటాలు.. ఇంట్లో చేస్తే ఆ రుచి రావడం లేదు అని కంప్లైంట్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. మీకు కూడా.. హోటల్స్ లో చేసినట్లు టేస్టు రావాలంటే.. పిండి కలిపేటప్పుడే.. దాంట్లో ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది.

అవును.. మామూలుగా అయితే.. మనం పిండి కలిపేటప్పుడు.. ఆ పిండిలో ఉప్పు వేసి.. తర్వాత కొద్దికొద్దిగా  నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉంటాం. అయితే.. దానితో పాటు కొద్దిగా నెయ్యి లేదంటే.. నూనె వేసి కలిసి చూడండి.. టేస్టు అదిరిపోతుంది. చాలా మంది నూనె కూడా వేసి ఉండొచ్చు. కానీ.. నెయ్యి వేసి కలిపితే మాత్రం టేస్ట్ టాప్ నాచ్ గా ఉంటుంది. కానీ.. ఆ నెయ్యిని మనం పిండిలో ఎప్పుడు వేయాలి అనేది మాత్రం తెలిసి ఉండాలి. అది ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos



పూరీ, పరాటా, రోటీ మీరు ఏది చేసినా సరే.. పిండి కలిపే టప్పుడు రెండు స్పూన్ల నెయ్యి కూడా వేయండి. దీని వల్ల వాటిని చేసిన తర్వాత రుచి అద్భుతంగా  ఉంటుంది. పూరీలు, రోటీలు అయితే మంచిగా పొంగుతాయి. పరాటా అయితే.. మంచిగా క్రిస్పీగా, క్రంచీగా కూడా వస్తాయి.
 

చాలా మందికి ఇాలా పిండిలో నూనె లేదంటే నెయ్యి వేసుకునే అలవాటు ఉంటుంది. కానీ.. వాళ్లు.. పిండి మొత్తం కలిపేసిన తర్వాత.. వేస్తూ ఉంటారు. అలా కాకుండా... పిండి పొడిగా ఉన్నప్పుడే.. నెయ్యిని జోడించాలి. నెయ్యితో పిండిని బాగా కలిపిన తర్వాత మాత్రమే.. నీరు పోసి పిండిని మంచిగా కలుపుకోవాలి. మీకు పిండి కూడా చాలా స్మూత్ గా వస్తుంది. 

ఇంకో బెనిఫిట్ ఏమిటంటే.. ఇలా పిండి కలపడం వల్ల.. పూరీలు ఎక్కువ నూనె పీల్చుకోవు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. 
 

click me!