పాలు ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా?

First Published | Jul 26, 2024, 12:57 PM IST

కొంతమంది రాత్రిపూటే పాలు తాగితే.. మరికొంతమంది ఉదయం పరిగడుపున పాలు తాగుతుంటారు. కానీ పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఏ పూట పాలు తాగితే  ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసా? 

పాలను తాగడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే  పోషకాలు, ఖనిజాలు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. పాలను తాగితే మన కండరాలు బలంగా ఉంటాయి. అయితే ఈ పాలను  కొంతమంది ఉదయాన్నే తాగితే.. మరికొంతమంది మాత్రం పడుకునే ముందు తాగడానికి ఇష్టపడతారు. కానీ పాలను పరిగడుపున తాగొచ్చా? లేదా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. అసలు పాలను పరిగడుపున తాగితే ఏమౌతుంది? పాలను ఎప్పుడు తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పాలను ఎప్పుడు తాగాలి? 

పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇకపోతే పాలను ఉదయం తాగాలా; రాత్రి తాగాలా? అనేది మీ ఇష్టం.  అయితే పాలను ఎప్పుడు తాగాలో అనే అయోమయంలో  ఉంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.


ఉదయం పాలను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? 

చాలా మంది ఉదయాన్నే పాలను తాగుతుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో జీర్ణక్రియ మెరుగుపడటం ఒకటి. ఉదయాన్నే పాలను తాగితే జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే బలహీనమైన ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది కండరాలు దృఢంగా మారుస్తుంది. కాబట్టి మీరు ఉదయాన్నే పాలను తాగినా బోలెడు లాభాలను పొందుతారు. 
 

milk

ఉదయాన్నే పాలు తాగడం వల్ల వచ్చే సమస్యలేంటి? 

కొందరికి ఉదయాన్నే పాలను తాగడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా లాక్టో అసహనం ఉన్నవారికి. వీళ్లు ఉదయాన్నే పాలను తాగితే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

పరిగడుపున పాలను తాగొచ్చా? 

పరిగడుపున పాలను తాగడం వల్ల కడుపులో ఎసిడిటీ, కడుపు చికాకు వంటి సమస్యలు వస్తాయి. పరిగడుపున పాలను తాగే అలవాటు ఉంటే వేడి పాలకు బదులుగా చల్లని పాలను తాగండి. చల్ల పాలను తాగితే కడుపులో ఎసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది.
 

Milk

పాలు తాగడానికి సరైన సమయం ఏది?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పాలు తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొవ్వు తక్కువగా ఉండే పాలనే తాగాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారు లేదా గుండె సమస్యలు ఉన్నవారు పరిగడుపున పాలను తాగకూడదు. అయితే రాత్రి పడుకునే ముందు పాలు తాగితే బాగా నిద్ర పడుతుంది. అలాగే వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యం బాగుంటుంది. 

Latest Videos

click me!