వారం రోజులు ఉల్లిగడ్డ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Aug 17, 2024, 11:23 AM IST

కూర ఏదైనా సరే దాంట్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే.  కానీ ఒక వారం పాటు మీరు ఉల్లిగడ్డ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
 

ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటాయి. ఈ మూడింటిని దాదాపుగా ప్రతి ఒక్క కూరలో వేస్తుంటాం. ముఖ్యంగా ఉల్లిగడ్డను. కొంతమంది ఉల్లిపాయలను సలాడ్ గా కూడా తింటుంటారు.  ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తింటే మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అయితే మీరు ఉల్లిపాయలను ఒక వారం పాటు తినకపోతే ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? పదండి దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఉల్లిపాయల ప్రయోజనాలు

ఉల్లిపాయల్లో అల్లైల్ ప్రొఫైల్ డైసల్ఫైడ్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్, విటమిన్ బి 6, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ఉల్లిగడ్డను వారం రోజులు తినకపోతే ఏం జరుగుతుందంటే? 
 


జీర్ణ సమస్యలు

ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మన పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు దీన్ని ఒక వారం పాటు తినకపోతే మీకు జీర్ణ సమస్యలు వస్తాయి.  

బలహీనమైన రోగనిరోధక శక్తి

ఉల్లిపాయలను తింటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా బలంగా ఉంటుంది. అదే మీరు ఒక వారం పాటు ఉల్లిపాయలని తినకపోవడం వల్ల మీ శరీరంలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు తగ్గుతాయి. దీంతో మీ ఇమ్యూనిటీ పవర్ కూడా బలహీనంగా మారుతుంది. దీంతో మీకు వ్యాధులు ఎక్కువగా సోకుతాయి. 

వాపు

ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మీరు ఉల్లిపాయల్ని వారం పాటు తినకపోతే మీ శరీరంలో వాపు సమస్యలు వస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి కూడా పెరుగుతుంది. 

బలహీనత 

ఉల్లిపాయలు మనల్ని బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అయితే మీరు ఈ ఉల్లిపాయల్ని తినడం ఆపేస్తే మీరు బాగా అలసటకు గురవుతారు. అలాగే ఎర్ర రక్త కణాలు ఏర్పడటం, రక్తం గడ్డకట్టడంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

onion 1.

ప్రశాంతమైన మనసు 

ఆయుర్వేదం ప్రకారం.. ఉల్లిపాయల్ని తినడం వల్ల కోపం, దూకుడు, అజ్ఞానం, బద్ధకం, ఆందోళన, లైంగిక కోరికలు వంటి కొన్ని ప్రతికూల భావోద్వేగాలు పెరుగుతాయి. అయితే మీరు వారం పాటు ఉల్లిపాయల్ని తినడం మానేస్తే మీ మనస్సును ప్రశాంతంగా ఉంటుంది. 

తగ్గిన ఆందోళన

మీరు ఒక వారం రోజులు ఉల్లిపాయల్ని తినకపోవడం వల్ల మీ ఆందోళన చాలా వరకు తగ్గుతుందని కొంతమంది అంటున్నారు. దీనిని తినకపోవడం వల్ల మీ మెదడు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరుకుతుంది.

Latest Videos

click me!