మైదా పిండితో చేసిన కేకులు, సమోసాలు, చపాతీలు, వేరే ఆహారాలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 17, 2024, 9:47 AM IST

మైదా పిండిని ఎన్నో ఫుడ్స్ ను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఇది శుద్ధి చేయబడిన పిండి. అందుకే ఈ పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తుంటారు. అసలు రోజూ మైదా పిండిని తినే వారికి ఏం జరుగుతుందో తెలుసా?
 

మైదా పిండితో చేసిన ఎలాంటి ఫుడ్ అయినా బలే టేస్టీగా ఉంటుంది. ఈ మైదాను పిజ్జా, బర్గర్లు, బ్రెడ్, కేకులు, భటూర్స్ వంటి ఎన్నో ఆహార పదార్థాలను తయారుచేస్తారు. వీటిని రోజూ తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ మైదా పిండిని రోజూ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును ఇది మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. అసలు మైదాను రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


పోషకాహార లోపం

మైదాలో పోషకాలు ఉండనే ఉండవు. ఇక మీరు రోజూ ఈ పిండిని తింటే మాత్రం మీ శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. నిజానికి మైదా గోధుమల నుంచే తయారవుతుంది. కానీ ఈ పిండి తయారుచేసే విధానం వల్ల దీంట్లోని పోషకాలన్నీ పోతాయి. ఈ పిండిలో ఫైబర్ కూడా ఉండదు. 
 



జీర్ణ సమస్యలు 

మైదా పిండి మనల్ని లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. ఈ పిండిని మీరు ప్రతిరోజూ తింటే మీకు జీర్ణక్రియకు సంబంధించిన మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ అస్సలు ఉండదు. దీనివల్ల ఈ పిండి అంత సులువుగా జీర్ణం కాదు. 

రక్తంలో చక్కెరను పెంచుతుంది 

మైదా పిండిని  డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ఈ పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు మైదా పిండితో చేసిన ఆహారాలను తిన్నట్టైతే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి. 

ఎముకలు బలహీనపడతాయి 

అవును మైదా పిండి మీ ఎముకలకు బలం లేకుండా చేస్తుంది. ఈ పిండిలో ఉండే మూలకాలు మన శరీరంలోకి వెళ్లగానే ఆమ్ల స్థాయిని పెంచుతాయి. దీంతో ఎముకలపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి.

గుండె అనారోగ్యం

మైదా పిండి మన గుండెను కూడా రిస్క్ లో పెడుతుంది. అవును ఈ పిండితో చేసిన ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరడగం ప్రారంభిస్తాయి. దీంతో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు మైదాను తినడం పూర్తిగా మానేయాలి. 

ఊబకాయం పెరుగుతుంది

మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలను రోజూ తినడం వల్ల మీ శరీర బరువు కూడా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఊబకాయం బారిన చాలా తొందరగా పడేస్తుంది. నిజానికి ఈ పిండిలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే మీరు బరువు పెరిగేలా చేస్తుంది. 
 

చిట్కాలు

అయితే మీరు ఈ పిండితో చేసిన ఆహారాలను తినాల్సి వస్తే దీనికి.. నిమ్మకాయ, బేకింగ్ సోడా లేదా పెరుగు వంటి ఈస్ట్ తయారు చేసి తినొచ్చు.  దీనితో పిండి మీ కడుపుకు అంటుకోకుండా ఉంటుంది. బాగా జీర్ణం అవుతుంది. ఈ పిండిని తినే వారు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే నీళ్లను పుష్కలంగా తాగాలి. పిండి తిన్న తర్వాత పెరుగును తప్పకుండా తినండి. ఇది మీకు జీర్ణం తొందరగా అయ్యేలాచేస్తుంది. 

Latest Videos

click me!