21 రోజుల్లో 7 కేజీల బరువు తగ్గే సీక్రెట్ డైట్..!

First Published | Aug 17, 2024, 11:00 AM IST

ముఖ్యంగా అన్ని రకాల నట్స్ కలిపిన స్మూతీని తీసుకోవడం మంచిది. ఇది.. మనకు బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటు... కొలాజిన్ ని పెంచి.. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.
 

Weight loss


ఈరోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి చాలా తిప్పలు పడుతున్నారు. కానీ సరైన డైట్ ఫాలో కాకపోతే.. బరువు తగ్గకపోక.. పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో మనం సరైన డైట్ ఫాలో అయితే కనుక సులభంగా బరువు తగ్గవచ్చు. కేవలం 21 రోజుల్లో ఈజీగా దాదాపు  7 కేజీల బరువు తగ్గొచ్చు. మరి.. ఆ డైట్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

ఉదయాన్నే మీ రోజుని ఒక జ్యూస్ తో ప్రారంభించాలి. ఆ జ్యూస్  మన గట్ ని శుభ్రం చేసేలా ఉండాలి. ముఖ్యంగా అన్ని రకాల నట్స్ కలిపిన స్మూతీని తీసుకోవడం మంచిది. ఇది.. మనకు బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటు... కొలాజిన్ ని పెంచి.. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.


ఇక లంచ్ లో...కచ్చితంగా 100 గ్రాముల గీక్ యోగర్ట్ తీసుకోవాలి. అంతేకాకుండా.. నార్మల్ రైస్ కి బదులు కినోవా రైస్, బీట్ రూట్ సలాడ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మినరల్స్, విటమిన్స్ మన బాడీకి అందుతాయి. ఈజీగా బరువు తగ్గించడంలోనూ సహాయం చేస్తాయి.

ఆహారంలో మార్పులతో పాటు.. కాస్త బాడీకి వ్యాయామం కూడా అంతే అవసరం. సాయంత్రం సమయంలో కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు బాడీకి వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. వాకింగ్, జాగింగ్, యోగా ఏదైనా సరే.. కసరత్తులు తప్పనిసరి. ఇది.. బరువు తగ్గడంలో, ఫ్యాట్ కరిగించడంలోనే కాదు.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయం చేస్తుంది.
 

సాయంత్రం వర్కౌట్ చేసిన తర్వాత ఒక ప్రోటీన్ షేక్ తాగాలి. దీని తర్వాత 199 గ్రాముల వైట్ చిక్ పీస్ లతో పాస్తా చేసుకొని తినొచ్చు. అది కూడా సాయంత్రం 6 లోగా తినేయాలి.
 

Intermittent Fasting

సాయంత్రం వర్కౌట్ చేసిన తర్వాత ఒక ప్రోటీన్ షేక్ తాగాలి. దీని తర్వాత 199 గ్రాముల వైట్ చిక్ పీస్ లతో పాస్తా చేసుకొని తినొచ్చు. అది కూడా సాయంత్రం 6 లోగా తినేయాలి.


ఉదయం 10 గంటలకు మీరు ఆహారం తీసుకుంటే.. చివరి భోజనం సాయంత్రం 6 లోగా ముగించేయాలి.  దీని వల్ల మీరు మిగిలిన 15 గంటలు ఉపవాసం ఉంటారు. ఈ ఫార్ములాను కరెక్ట్ గా 21 రోజులు ఫాలో అవుతూ, జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటూ...ప్రతి మీల్ లోనూ ప్రోటీన్; ఫైబర్, న్యూట్రియంట్స్ అన్నీ ఉండేలా చూసుకుంటూ.. వ్యాయామం చేస్తే.. ఈజీగా బరువు తగ్గుతారు. కనీసం 7 కేజీల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ప్రయత్నించి చూడండి.

ఒకేసారి ఇలా బరువు తగ్గితే.. మీ ముఖంలో గ్లో తగ్గిపోతుందేమో అని భయపడుతున్నారేమో.. అలా జరిగే ఛాన్సే లేదు. ఈ రకం డైట్ తీసుకుంటే.. మీరు బరువు తగ్గడమే కాదు.. మీ ముఖంలో కాంతి పెరగడం కూడా చూస్తారు. 

Latest Videos

click me!