బక్కగా ఉన్నామని బాధపడుతున్నారా? బరువు పెరగాలంటే ఇవి తినండి?

First Published | Jun 28, 2024, 12:50 PM IST

కొంతమంది బరువు ఎక్కువగా ఉన్నామని బాధపడితే.. మరికొంతమంది బరువు తక్కువగా ఉన్నామని బాధపడుతుంటారు. ఈ రెండూ  ఆరోగ్యానికి మంచిది కాదు. మరి మరీ పుల్లలా సన్నగా ఉన్నవారు ఏం చేస్తే లావుగా అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతుంటే.. మరికొంతమంది మాత్రం సన్నగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఈ రెండూ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటివల్ల ఎన్నో రకాల జబ్బులు రావడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. అందుకే ఈరోజు బక్కగా ఉన్నవారు ఏం తింటే బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image: Getty Images

పాల ఉత్పత్తులు 

పాల ఉత్పత్తులు పోషకాలకు మంచి వనరులు. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మఅంతేకాదు ఇవి మీరు ఆరోగ్యంగా బరువు పెరగడానికి కూడా బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకవేళ మీరు బరువు పెరగాలనుకుంటే పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తినండి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగడానికి సహాయపడతాయి. 
 

Latest Videos


అరటిపండు

అరటి మంచి పోషకాలున్న పండు. ఇది మీకు తక్షణ ఎనర్జీని అందించడమే కాకుండా.. మీరు ఆరోగ్యంగా బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. అరటిపండులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే మీరు బరువు ఖచ్చితంగా పెరుగుతారు. మీరు బరువు పెరగాలనుకుంటే రోజుకు 3 నుంచి 4 అరటిపండ్లను తినొచ్చు. 
 

అరటిపండు, పాలు 

అరటి పండు, పాల కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చాలా మంది తింటుంటారు. కానీ అరటిపండును పాలతో కలిసి తింటే మీరు బరువు పెరుగుతారు తెలుసా? అవును ఈ కాంబినేషన్ వల్ల మీ కండరాలు పెరుగుతాయి. ఇలా తింటే 15-20 రోజుల్లో మీ శరీరం పెరగడం ప్రారంభమవుతుంది. 

ఆలుగడ్డ 

బంగాళాదుంపలను రెగ్యులర్ గా తినేవారున్నారు. నిజానికి ఆలుగడ్డ కూడా మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. అరటిలో కేలరీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు సన్నగా ఉన్నారనుకుంటే దీన్ని రెగ్యులర్ గా తినండి. కొన్ని రోజుల్లోనే తేడాను గమనిస్తారు. 
 

గుడ్లు 

గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిని తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ గుడ్లను తింటే కూడా బరువు పెరుగుతారన్న ముచ్చట చాలా తక్కువ మందికే తెలుసు. క్రమం తప్పకుండా మీరు రోజూ 2 నుంచి 3 గుడ్లను తింటే మీరు వెయిట్ పెరగడం ప్రారంభమవుతుంది. 
 

dry fruits

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ మంచి పోషకాహారం. డ్రై ఫ్రూట్స్ ను తింటే మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా హెల్తీగా బరువు కూడా పెరుగుతారు. అలాగే మీరు లోపలి నుంచి బలంగా ఉండాలంటే బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తినండి. 

click me!