రాత్రిపూట నిద్రపట్టడానికి ఏం చేయాలో తెలుసా?

First Published | May 10, 2024, 1:14 PM IST

చాలా మందికి రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, యాంగ్జైటీ, నిరాశ వంటివన్నీ నిద్ర లేమికి కారణమవుతాయి. అయితే కొన్ని చిట్కాలతో మీరు రాత్రిళ్లు హాయిగా, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోవచ్చు. 

no sleep

మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్రకూడా అంతే అవసరం. నిద్ర అలసిపోయిన శరీరాన్ని తిరిగి శక్తివంతంగా తయారుచేస్తుంది. గాయాలు తొందరగా మానడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా? ఎన్నో వ్యాధులు నిద్రతోనే సగం తగ్గిపోతాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో  బాధపడుతున్నారు. మీకు తెలుసా? మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే అది మీ శరీర ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రిళ్లు నిద్రరాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒత్తిడి,  నిరాశ, యాంగ్జైటీ వంటివి నిద్రలేమికి కారణమవుతాయి. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో నిద్రలేమికి గుడ్ బై చెప్పొచ్చు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని పానీయాలు నిద్రలేమి సమస్యను దూరం చేయడానికి సహాయపడతాయి. అవేంటంటే? 

పాలు

పాలలోని కాల్షియం మెలటోనిన్ అనే హార్మోన్ అయిన ట్రిప్టోఫాన్ ను మెదడుకు రవాణా చేసే పనిని నిర్వహిస్తుంది. ఇది మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అందుకే రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగండి. దీంతో మీకు బాగా నిద్రపడుతుంది. 
 


బాదం

బాదంలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బాదం కూడా మీరు బాగా నిద్రపోవడానికి బాగా సహాయపడుతుంది. బాదంలో ఉండే మెగ్నీషియం మెలటోనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అలాగే ఇది నిద్రకు సహాయపడుతుంది. కాబట్టి బాదం పాలు తాగడం వల్ల నిద్ర సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 
 

Turmeric Milk

పసుపు పాలు

పసుపు పాలు కూడా రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోవడానికి సహాయపడతాయి. రాత్రిపూట పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే బాగా నిద్ర పడుతుంది. పసుపులోని కర్కుమిన్ మీరు నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చెర్రీ జ్యూస్

నిద్ర లేమి సమస్యను పోగొట్టడంలో చెర్రీ జ్యూస్ కూడా బాగా సహాయపడుతుంది.  చెర్రీ జ్యూస్ లో నిద్రలేమిని సరిదిద్దే మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రాత్రిపూట చెర్రీ జ్యూస్ ను తాగడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది.
 

kiwi juice


కివి జ్యూస్

కివి జ్యూస్ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కివి జ్యూస్ ను తాగడం వల్ల కంటినిండా నిద్రవస్తుంది. 
 

పిప్పరమింట్ టీ

పుదీనా ఆకులు కూడా రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడానికి ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పుదీనా టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మంచి నిద్రను పొందడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు రాత్రిపూట పిప్పరమింట్ టీని తాగొచ్చు.
 

అల్లం టీ

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న అల్లం టీ కూడా మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడతాయి. మీరోజువారి ఆహారంలో అల్లం టీని చేర్చడం వల్ల బాగా నిద్రపోతారు. 

Latest Videos

click me!