కందిపప్పును తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 9, 2024, 3:49 PM IST

పప్పుధాన్యాలు ప్రోటీన్ లకు మంచి వనరు. శాఖాహారులకు మంచి పోషకాహారం. శెనగలు, పెసరపప్పు, మసూర్, కందిపప్పు వంటి పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ చాలా మందికి కందిపప్పే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అసలు కందిపప్పును తింటే ఏమౌతుందో తెలుసా? 
 

కాయధాన్యాలు ప్రోటీన్ కు మంచి వనరులు. వీటిని రోజూ తినడం వల్ల ప్రోటీన్ మాత్రమే కాదు మరెన్నో పోషకాలు అందుతాయి. పెసరపప్పు, మసూర్, శెనగపప్పు వంటి ఎన్నో పప్పుధాన్యాలు మన ఫుడ్ రుచిని పెంచుతాయి. కానీ వీటిలో కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

కందిపప్పులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కందిపప్పును తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..


కంది పప్పులో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. మన మొత్తం ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషణ. మీరు శాకాహారులైతే మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను పొందడానికి కందిపప్పును మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. 

కంది పప్పులో కూడా ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడానికి కూడా పని చేస్తాయి.

కంది పప్పులో ప్రోటీన్ తో పాటుగా మెండుగా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది అతిగా తినకుండా చేస్తుంది. అలాగే బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది. 

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు మంచి పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గర్భిణులు కందిపప్పును తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. కందిపప్పు చాలా సులువుగా జీర్ణమవుతుంది. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కందిపప్పులో ఫోలిక్ యాసిడ్ తో పాటుగా కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో అవసరం.

Latest Videos

click me!