బీపీ ఉన్నవాళ్లు ఏం తినకూడదో తెలుసా?

First Published Apr 5, 2024, 1:07 PM IST

అధిక రక్తపోటు చిన్నసమస్యేం కాదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తపోటును అమాంతం పెంచేస్తాయి.

blood pressure

పెద్దవారే కాదు చిన్న పిల్లలు, యువకులు కూడా అధిక రక్తపోటు సమస్య బారిన పడుతున్నారు. ఈ రక్తపోటును సకాలంలో గుర్తించకపోతే ప్రాణాల మీదికి వస్తుంది. ఎంతో మంది రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అధిక రక్తపోటుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం మొదలైనవి రక్తపోటును బాగా పెంచుతాయి. మరి రక్తపోటు ఉన్నవారు తినకూడని ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కాఫీ

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అమాంతం పెరుగుతుంది. అందుకే బీపీ పేషెంట్లు కాఫీకి దూరంగా ఉండాలి. 
 

ఉప్పు

అధిక రక్తపోటు ఉన్నవాళ్లు పొరపాటున కూడా ఉప్పును ఎక్కువగా తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉప్పును రోజుకు ఆరు గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి. ఇది రక్తపోటును నియంత్రించడానికి  సహాయపడుతుంది.

వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన, ఫ్రై చేసిన ఆహారాలు టేస్టీగా ఉంటాయి . అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ ఈ ఆహారాల్లో ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రక్తపోటును మరింత పెంచుతాయి. అందుకే రక్తపోటు ఉన్నవారు వీటిని తినకూడదని నిపుణులు చెప్తారు. 

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ ఫుడ్ కు దూరంగా ఉండటమే మంచిది. రక్తపోటును నియంత్రించడానికి జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. 
 

processed meat

ప్రాసెస్ చేసిన మాంసం

అధిక రక్తపోటును నియంత్రించడానికి మీరు ప్రాసెస్ చేసిన మాంసం, మటన్, గొడ్డు మాంసం వంటి రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. వీటిని తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే గుండె ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. అందుకే వీటిని మాత్రం తినకూడదు.
 

చక్కెర

చక్కెరను మధుమేహులే కాదు రక్తపోటు పేషెంట్లు కూడా తినకూడదు. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, తియ్యటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. అందుకే బీపీ పేషెంట్లు తీపి పదార్థాలను చాలా మటుకు తగ్గించాలి. అంతేకాదు వీళ్లు మందును కూడా ఎక్కువగా తాగకూడదు. 

click me!