కూల్ డ్రింక్స్ కాదు.. ఎండాకాలంలో తాగాల్సినవి ఇవే.. !

First Published | Apr 4, 2024, 2:16 PM IST

ఉక్కపోతలను, వేడిని తట్టుకోలేక మధ్యాహ్నం, సాయంత్రం వేలల్లో చాలా మంది చల్లచల్లని కూల్ డ్రింక్స్ ను తాగుతుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎండాకాలంలో వీటికి బదులుగా వేరే ఆరోగ్యకరమైన పానీయాలను తాగితే మీరు చల్లగా ఉంటారు. ఆరోగ్యంగానూ ఉంటారు. 
 

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచే బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఏప్రిల్ నెల మొదలుకావడంతో వేసవి కాలం తన సత్తాను చూపడం స్టార్ట్ చేసింది. ఉక్కపోతను తట్టుకోలేక చాలా మంది చల్లగా ఉండే శీతల పానీయాలను తెచ్చుకుని తాగుతుంటారు. కూల్ డ్రింక్స్ వేడిని తగ్గించడంతో పాటుగా శరీరాన్ని చల్లబరుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ దీనిలో కొంచెం కూడా నిజం లేదు. 

నిజమేంటంటే కూల్ డ్రింక్స్ మిమ్మల్ని కాసేపు వరకు మాత్రమే చల్లగా ఉంచుతాయి. కానీ మీ ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు దెబ్బతీస్తాయి. నిజానికి సోడా ఉన్న చక్కెర పానీయాలను తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి. అందుకే ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి వీటికి బదులుగా మనం తాగాల్సిన పానీయాలు వేరే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కొబ్బరి నీరు

ఎండాకాలంలో కొబ్బరి నీరు కొదవే ఉండదు. ఎక్కడ చూసినా కొబ్బరి బోండాలు కనిపిస్తుంటాయి. ఈ వాటర్ లో ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీరు రీఫ్రెష్ గా మారుతారు. అలాగే మీ శరీరాన్ని రీహ్రైడ్రేట్ చేస్తుంది.  వ్యాయామాల తర్వాత కోలుకోవడానికి కూడా ఈ పానీయం సహాయపడుతుంది.
 


తాజా పండ్ల రసం

పండ్ల రసాలను కూడా ఎండాకాలంలో ఖచ్చితంగా తాగాలి. ఇవి మనం ఎండాకాలంలో ఆరోగ్యంగా, రిఫ్రెష్ గా ఉండటానికి సహాయపడతాయి. ఇందుకోసం మీరు నారింజ రసం లేదా తియ్యని పైనాపిల్ వంటి తాజా పండ్ల రసాలను తాగొచ్చు. పండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతం చేయడానికి, రీహైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.
 

నిమ్మరసం

ఎండాకాలంలో నిమ్మరసాన్ని ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎండల నుంచి రక్షిస్తుంది. అయితే ఈ రసంలో చక్కెరను మాత్రం వేసుకోకండి. ఈ పానీయం మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది. అలాగే రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.  గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Kombucha

కొంబుచా అనేది పులియబెట్టిన బ్లాక్ టీ. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో చక్కెర తక్కువగా ఉంటుంది. అలాగే  గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 

Latest Videos

click me!