మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఏయే వంటకాలు చేయొచ్చో తెలుసా?

First Published | Apr 4, 2024, 4:46 PM IST

ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినా, సాయంత్రం స్నాక్స్ అయినా ఇడ్లీని ఎక్కువగా తింటుంటారు చాలా మంది. అయితే చాలా సార్లు ఇడ్లీ పిండి ఎక్కువగా మిగిలిపోతుంటుంది. అయితే దీనితో మీరు టేస్టీ టేస్టీ వంటకాలను తయారుచేసి తినొచ్చు. అవేంటంటే? 

ఇడ్లీ, దోశ, ఉప్మా లను చాలా మంది ఇష్టంగా తింటారు. ఎక్కడ చూసినా జనాలు సౌత్ ఇండియన్ ఫుడ్ ను రుచి చూడడం మొదలుపెట్టారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అందుకే చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తినడానికి ఇష్టపడతారు. ఇడ్లీ దోశ, ఉత్తపం వంటి ఎన్నో బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ లను చాలా మంది ఇంట్లోనే తయారుచేస్తారు. అయితే చాలా సార్లు ఇడ్లీ పిండి మిగిలిపోతుంటుంది.  ఇక తప్పక ఇడ్లీలనే వేసుకుని తింటుంటారు. కానీ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మీరు టేస్టీ టేస్టీ వంటకాలను తయారుచేయొచ్చు. వీటిని తయారుచేయడం చాలా ఈజీ కూడా. అవేంటేంటో చూద్దాం పదండి. 

ఇడ్లీ పిజ్జా

ఇడ్లీ పిజ్జా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడానికి మిగిలిపోయిన పిండిలో క్యాప్సికమ్, జున్ను, ఉల్లిపాయలు, టమాటాలు, చాట్ మసాలా, కశ్మీరీ ఎండుమిర్చి, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపండి. దీన్ని ఇడ్లీ స్టాండ్ లో నూనె వేసి పోయండి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికితే బయకు తీయాలి. వేడివేడిగా సర్వ్ చేసి తింటే సరి. 

Latest Videos


idli upma

ఇడ్లీ ఉప్మా

ఇడ్లీ ఉప్మా తయారుచేయడం చాలా ఈజీ. ఇందుకోసం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో సాదా ఇడ్లీలను తయారుచేయండి. ఈ ఇడ్లీలు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు (ఆప్షనల్) వేసి రంగు వచ్చే వరకు బాగా ఉడికించండి. తర్వాత పసుపు, ఉప్పు, ఇడ్లీ ముక్కలు వేసి బాగా వేయించి దించండి. అంతే.. వేడివేడిగా తింటే టేస్ట్ అదిరిపోతుంది. .
 

ఇడ్లీ పకోడా

మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మీరు పకోడి తయారుచేయొచ్చు. ఇందుకోసం ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, కొత్తిమీర, అల్లం తురుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పాన్ లో పకోడీ లాగ  ఈ పిండిని వేసుకోవాలి. రెండు వైపులా బాగా వేయించి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత బయటకు తీసేయాలి. దీన్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే సరి.

click me!