fruits
మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ఒకటి. అన్నిరకాల పండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనలో పోషక లోపాలను పోగొట్టి ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్లను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వీటితో పాటుగా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే మరి పండ్లను ఏ పూట తింటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉదయం నిద్రలేచిన తర్వాత..
పండ్లు మన శక్తి స్థాయిలను పెంచుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేవగానే ఒక పండు తిని మీ రోజును స్టార్ట్ చేయాలని చెప్తారు. పండ్లలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు రాత్రి ఉపవాసం తర్వాత మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. దీంతో మీరు ఎనర్జిటిక్ గా మీ రోజువారి పనులను పూర్తి చేసుకుంటారు.
Fruits
వ్యాయామానికి ముందు..
వ్యాయామం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అయితే వ్యాయామంలో మీరు చురుగ్గా పాల్గొనాలంటే మాత్రం వ్యాయామానికి ముందు ఖచ్చితంగా పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో పండ్లను తినడం వల్ల మీరు మరింత ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే వ్యాయామం కోసం మీ స్టామినాను పండ్లు పెంచుతాయి.
లంచ్ తర్వాత..
లంచ్ తర్వాత కూడా మీరు పండ్లను ఎంచక్కా తినొచ్చు. ఇది మిమ్మల్ని మీ రాత్రి భోజనం వరకు కడుపును నిండుగా ఉంచుతుంది. మీకు శక్తిని అందిస్తుంది. అలాగే భోజనం తర్వాత తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన పండ్లను తినండి. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
fruits
బ్రేక్ ఫాస్ట్
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు ఉదయం మనకు నేచురల్ షుగర్ ను అందిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా శక్తిని అందిస్తాయి. మీరు పండ్లను స్నాక్స్ గా కూడా తినొచ్చు. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ప్రయాణం చేసేటప్పుడు
మీరు జర్నీలో కూడా పండ్లను తినొచ్చు. ఇవి మీరు సౌకర్యవంతంగా జర్నీ చేయడానికి, హెల్తీగా ఉండటానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అందుకే ప్రయాణం చేసేటప్పుడు కూడా పండ్లను తినొచ్చు.