మైదా పిండితో చేసిన ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Mar 19, 2024, 12:05 PM IST

చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు పెడుతున్న ఈ మైదా వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? అంతేకాదు.. ఈ మైదాను మనం రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఓసారి చూద్దాం..
 

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది కేక్స్, కుకీస్ ఇష్టంగా తింటారు. ఇవి మాత్రమేనా.. బ్రేక్ ఫాస్ట్ లో మనం ఇష్టంగా తినే పూరీ, బోండా, రోటీ, పుల్కా.. ఇలా ఏది చూసినా అన్నీ మైదా పిండితో చేసినవే. మనం తెలీకుండానే.. వివిధ రకాల ఫుడ్స్ రూపంలో మనం  మైదా పిండిని తింటున్నాం. కానీ.. ఈ మైదా ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయం మీకు తెలుసా?
 

Maida

 మైదా తినడం అంటే..  మన చేతితో మనమే విషయం తినడంతో సమానం. చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు పెడుతున్న ఈ మైదా వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? అంతేకాదు.. ఈ మైదాను మనం రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఓసారి చూద్దాం..
 



1.మైదా పిండితో చేసే ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల సులభంగా బరువు పెరిగిపోతారు. ఈ మైదాలో క్యాలరీలు ఎక్కువగానూ, ఫైబర్ తక్కువగానూ ఉంటాయి.కాబట్టి.. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే...అధిక బరువు పెరుగుతారు.

2.మైదా పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగిపోతాయి. డయాబెటిక్స్ తో బాధపడేవారు కనుకఈ మైదా పిండి ఉన్న ఆహారాలు తింటే,. వారి షుగర్ లెవల్స్ మరింత పెరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.
 

3.మైదాపిండి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకునే వారిలో ఎక్కువగా అరుగుదల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే.. మైదాలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల.. బ్లోటింగ్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.


4.మైదా పిండితో చేసే ఫుడ్స్  మీకు రుచిగా అనిపించవచ్చు. కానీ.. దీంటో.. కొంచెం కూడా పోషకాలు ఉండవు. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇలాంటివి ఏమీ ఉండవు. రెగ్యులర్ గా మైదా పిండి తినడం వల్ల... మనలో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.

maida

5.మైదాపిండి తినడం వల్ల.. గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మైదాలో కొలిస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీటిని తినడం వల్ల  గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే.. వీలైనంత వరకు  మైదాపిండి తో తయారు చేసే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 

Latest Videos

click me!