స్వచ్ఛమైన నెయ్యి ఏ రంగులో ఉంటుంది..? కల్తీ నెయ్యి కనిపెట్టడమెలా?

First Published | May 15, 2021, 11:26 AM IST

స్వచ్ఛమైన దేశీ నెయ్యి రంగు పసుపు లేదా.. బంగారు వర్ణంలో ఉంటుంది. గడ్డకట్టిన నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది.. దానిని వేడి చేసిన ప్పుడు బంగారు రంగులో కనపడుతుంది.

నెయ్యి.. ఆరోగ్యానికి చాలా మంచిది. భారతీయులు భోజన సమయంలో నెయ్యి వాడకం కాస్త ఎక్కువనే చెప్పాలి. వంటల తయారీలతోపాటు.. భోజనం చేసే సమయంలోనూ నెయ్యిని తీసుకుంటారు. ఇక ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే.. వారికి కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. పిల్లలకు నెయ్యి కలిపిన ఆహారం భోజనంగా పెడితే.. చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
undefined
అయితే.. ఒకప్పుడు అంటే.. అందరికీ ఇళ్లల్లోనే పాడి ఉండేది.. స్వచ్ఛమైన నెయ్యి దొరికేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. అందరం బయట కొనుక్కోవాల్సిందే. ఆ మార్కెట్లో లభించే నెయ్యిలో ఏది స్వచ్ఛమైనదో కాదో చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలో బయట కొనాలంటే కూడా బయమేస్తోంది. ఈ క్రమంలో.. అసలైన స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
undefined

Latest Videos


స్వచ్ఛమైన దేశీ నెయ్యి రంగు పసుపు లేదా.. బంగారు వర్ణంలో ఉంటుంది. గడ్డకట్టిన నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది.. దానిని వేడి చేసిన ప్పుడు బంగారు రంగులో కనపడుతుంది. బయట మనం మార్కెట్లలో కొనే నెయ్యిలో ఫ్రాగ్నెన్స్, ప్రెసర్వేటివ్స్ కలుపుతారు. వాటి వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లలో ఎన్నో రకాల బ్రాండ్ల నెయ్యి అమ్ముతారు. అవి కూడా చూడటానికి స్వచ్చమైన నెయ్యి రంగులోనే కనిపిస్తాయి. దీంతో వాటిలో ఏది స్వచ్ఛమైనదో గుర్తించడం కాస్త కష్టమైన పనే అని చెప్పాలి.
undefined
మార్కెట్లలో అమ్మే నెయ్యిల్లో చాలా మంది కొబ్బరి నూనె కూడా కలుపుతున్నారట. లేదా ఆల్మండ్ ఆయిల్.. కొందరైతే వనస్పతి కూడా కలుపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన నెయ్యిని గుర్తంచాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో కావాలి. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
Method 1నెయ్యి స్వచ్ఛతను గుర్తించడానికి మొదటి పద్దతి ఇది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని.. దానిని మీడియం మంట మీద వేడి చేయాలి. పాన్ వేడి అయిన తర్వాత.. దానిపై కొద్దిగా నెయ్యి ఉంచాలి. నెయ్యి వెంటనే కరిగిపోయి బంగారు వర్ణంలోకి వస్తే.. అది స్వచ్ఛమైనదిగా గుర్తించాలి. అలా కాకుండా కరగడానికి సమయం తీసుకొని.. కరిగిన తర్వాత పసుపు రంగులోకి మారితే.. దానిని స్వచ్ఛమైనది కానిదని గుర్తించాలి.
undefined
Method 2ఈ పద్దతి ద్వారా నెయ్యిలో కొబ్బరి నూనె కలిసిందో లేదో గుర్తించొచ్చు. ముందుగా నెయ్యిని గాజు గిన్నెలో తీసుకొని.. దానిని డబల్ లేయర్డ్ పద్దతిలో కరిగించాలి. తర్వాత దానిని వేరే గాజు జార్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అప్పుడు.. అది నెయ్యి.. కొబ్బరి నూనెగా విడిపోయి లేయర్లుగా గడ్డకడుతుంది.
undefined
​Method 3కొద్దిగా నెయ్యి తీసుకొని​ కొద్దిగా అరచేతిలో రాసుకోవాలి. వెంటనే కరిగిపోతే అది స్వచ్చమైనదిగా గుర్తించాలి. అలా కాకుండా.. చేతిలో కరగకుండా ఉంటే.. అది కల్తీగా గుర్తించాలి.
undefined
Method 4దీనిని ల్యాబ్ లో చేస్తారు. టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా నెయ్యి తీసుకొని వేడి చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా గాఢత ఎక్కువగా ఉన్న హెచ్ సీఎల్ తో పాటు కొద్దిగా పంచదార వేయాలి. తర్వాత మిశ్రమాన్నికలపాలి. ఇప్పుడు ఆ నెయ్యి అడుగు భాగాన పింక్ లేదా రెడ్ కలర్ కనపడితే.. అది కల్తీ నెయ్యి అని అర్థం. దాంట్లో వనస్పతి కలిసిందని గుర్తించాలి.
undefined
click me!