ట్రెండింగ్ : బటర్ చికెన్ కేక్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఎందుకంటే..

First Published | May 14, 2021, 2:07 PM IST

ఫుడ్ ఇండస్ట్రీలో ఆవిష్కరణలు కొత్తేమీ కాదు. చాలాసార్లు ఇవి ఆశ్చర్యపరుస్తుంటాయి. అబ్బురపరుస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడొక ఆవిష్కరణ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మీరు బటర్ చికెన్ ప్రేమికులైతే ఇది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. 

ఫుడ్ ఇండస్ట్రీలో ఆవిష్కరణలు కొత్తేమీ కాదు. చాలాసార్లు ఇవి ఆశ్చర్యపరుస్తుంటాయి. అబ్బురపరుస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడొక ఆవిష్కరణ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మీరు బటర్ చికెన్ ప్రేమికులైతే ఇది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది.
అదే.. బట్టర్ చికెన్ కేక్.. కేక్? అదీ బట్టర్ చికెన్ తోనా? ఎలా సాధ్యం అని డౌటనుమానం వస్తుందా? దాన్ని నిజం చేసి చూపించారు నటాలీ సైడ్‌సర్ఫ్ అనే ఫుడ్ బ్లాగర్.

యూ ట్యూబ్ లో ఇప్పుడామె వీడియోకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. నమ్మలేకపోతున్నారా? అయితే యూట్యూబ్ లో ఓ సారి బట్టర్ చికెన్ కేక్ అని సెర్చ్ చేసి.. మీ కళ్లతో మీరే చూడండి.
నటాలీ సైడ్‌సర్ఫ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రత్యేకమైన హైపర్‌రియల్ కేక్ లతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఫుడ్ బ్లాగరే దీన్ని తయారు చేసి ఈ వీడియోను షేర్ చేశారు.
నటాలీ ఇటీవల ఒక బటర్ చికెన్ కేక్ తయారు చేసింది. ఇది చికెన్ ప్రేమికులందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మసాలా బటర్ చికెన్‌తో నిండిన రాగి గిన్నెలా కనిపిస్తుంది. మధ్యలో నుంచి కట్ చేసినప్పుడు అనేక పొరలతో ఉన్న కేక్ అని తెలుస్తుంది. అప్పటివరకు మీ కళ్లు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటాయి.
రెసిపీ వీడియో చూపించిన దాని ప్రకారం పైన బటర్‌క్రీమ్‌తో ఉన్న రెండు పొరల స్పాంజి కేక్‌ అని తెలుస్తుంది. స్పైసీ గ్రేవీ ఎఫెక్ట్ కోసం, ఆమె స్ట్రాబెర్రీ సాస్‌తో ఎరుపు, తెలుపు ఫుడ్ కలర్స్ మిశ్రమాన్ని ఉపయోగించింది.
బైటివైపు గిన్నెలా కనిపించడానికి మోడలింగ్ చాక్లెట్ ఉపయోగించింది. దీంతో గిన్నె ఆకృతి, రంగు అది నిజమైన బటర్ చికెన్ కావచ్చు అనే భ్రమ కలిగిస్తుంది. దీని కోసం ఆమె ఎడిబుల్ రాగి పెయింట్ ను ఉపయోగించింది.
ఆమె ఫర్ ఫెక్షన్ ను నెటిజన్లు ఫిదా అయ్యారు. చాలామంది ఇది నిజం అయితే బాగుండునంటూ కామెంట్స్ పెట్టారు. అంతేకాదు బటర్ చికెన్ అనుకుని తిని నేను నిరాశ పడతానేమో అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇంకొకతను ఇండియాలో ఏ ప్రాంతమైన దాని ప్రత్యేకత దానిదే.. ఇండియన్ అయినందుకు గర్విస్తున్నాను అని పెడితే.. మరొకరు ఈ కేక్ చూసి మా నాన్న, తమ్ముడు నిజంగా బట్టర్ కేక్ అనుకునేలా ఉన్నారంటూ కామెంట్స్ చేశారు.

Latest Videos

click me!