పర్షియన్ క్యుజిన్ నుంచి ఇండియాకు వచ్చిన మరో అద్భుత వంటకం షీర్ కుర్మా. రంజాన్ అనగానే ముందుగా నోరూరించే షీర్ కుర్మా గుర్తుకు వస్తుంది. ఈద్ నాడు ముస్లిం స్నేహితుల ఇళ్లకు వెళ్లడమో.. వారే మనింటికి వంటకాలు పంపడమో రివాజు.
కరోనా మహమ్మారితో ఇంట్లో నుంచి అడుగు బైటపెట్టాలంటే ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడిది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఎంచక్కా ఇంట్లోనే షీర్ కుర్మా తయారు చేసుకుని మీరూ ఈద్ చేసుకోండి.
షీర్ కుర్మాలో టేస్ట్ కోసం ఇలాచీ, కుంకుమపువ్వు, గసగసాలను వాడతారు. వీటితో పాటు మరిన్ని సుగంథ ద్రవ్యాలు, రోజ్ వాటర్, కోవాతో మరింత రుచికరంగా తయారు చేయడమెలాగో చూడండి.
షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు1 లీటర్ పాలు14 కప్పు చక్కెర పొడి14 కప్పు బాదం14 కప్పు ఎండుద్రాక్ష2 టేబుల్ స్పూన్ల నెయ్యి2 టేబుల్ స్పూన్ ఖోయా12 కప్పు వేయించిన వర్మిసెల్లి14 కప్పు జీడిపప్పు14 కప్పు పిస్తా6 గింజలు తీసిన ఖర్జూరాలు1 టీస్పూన్ రోజ్ వాటర్

షీర్ కుర్మా తయారు చేసే విధానంముందుగా స్టౌ మీద బాణలి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్షలు వేసి కొన్ని నిమిషాలు పాటు వేయించాలి.
మరో గిన్నెలో పాలు పోసి వాటిని మరగనివ్వాలి. పాలు బాగా మరిగాక వేయించిన వర్మిసెల్లి ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. పాలు సగానికి అయ్యేవరకు అలాగే ఉడికించాలి.

దీనికి మీ ఇష్టాన్ని బట్టి కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. షీర్ కుర్మాను వేడిగా లేదా చల్లగా మీ ఇష్టాన్ని బట్టి తినొచ్చు.