ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నంతో పాటుగా చపాతీలు కూడా ఉంటాయి. చాలా మంది గోధుమ పిండి చపాతీలే ఎక్కువగా చేస్తుంటారు. చాలా మంది బరువు తగ్గడానికి ప్రతిరోజూ చపాతీలను తింటున్నారు. దేనికోసం తిన్నా చపాతీలు మాత్రం ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. గోధుమ పిండితో చేసిన చపాతీలు కడుపును త్వరగా నింపుతాయి. అలాగే గోధుమ పిండిలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే మీరు తినే చపాతీలు మరింత సాఫ్ట్ గా, హెల్తీగా ఉండాలంటే పిండిలో కొన్నింటిని కలపాలి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.