చపాతీ లేదా రైస్.. బరువు తగ్గడానికి ఏది తింటే మంచిది?

First Published | Aug 14, 2024, 4:25 PM IST

షుగర్ ఒక దీర్ఘకాలిక సమస్య. అలాగే ప్రమాదకరమైన వ్యాధి కూడా. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీన్ని పూర్తిగా తగ్గించుకోలేం. కేవలం నియంత్రించగలం అంతే. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు బరువు తగ్గడానికి అన్నం తినాలా? చపాతీ తినాలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ప్రస్తుత కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. రోజంతా ఆఫీసుల్లో కుర్చిలో కూర్చోని పనిచేయడం వల్ల శరీర బరువు పెరిగిపోతుంది. కానీ బరువు పెరగడం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. కానీ డయాబెటీస్ పేషెంట్లు బరువు పెరగడం అస్సలు మంచిది కాదు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు బరువును అదుపులో  ఉంచకపోతే ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  అయితే డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడానికి అన్నం మంచిదా? లేక రోటీ మంచిదా? అన్న డౌట్ వస్తుంటుంది. మరి షుగర్ ఉన్నవారు బరువు తగ్గడానికి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పోషక విలువలు

ఇండియన్స్ కి బియ్యం, రోటీలు రెండూ ఒక ముఖ్యమైన భాగం. అయితే ఎవరికి ఏది తినాలనిపిస్తే అది తింటుంటారు. అయితే అన్నంలో కంటే రోటీలోనే మినరల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే ఒక్క బియ్యంలోనే కాదు.. రోటీలో కూడా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే రోటీలో ప్రోటీన్ కంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే బియ్యంలో కంటే రోటీలోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 
 


అన్నంలో ఫైబర్స్ తక్కువగా ఉంటాయి. అయితే మీరు కడుపు నిండా అన్నం తిన్నా.. దానిలో ఉండే పిండి పదార్థాల వల్ల ఇది చాలా తొందరగా జీర్ణమవుతుంది. కాబట్టి దీనివల్ల మీకు ఆకలిగా అనిపించడం మొదలవుతుంది. అదే రోటీలో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి అన్నం కంటే రోటీనే బెస్ట్ ఆప్షన్. 
 

అన్నం కంటే రోటీ ఎందుకు మంచిది?

మీరు గనుక వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా మీకు డయాబెటిస్ సమస్యలు ఉన్నా అన్నానికి బదులుగా రోటీనే తినండి. సాధారణంగా బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి చాలా ఫాస్ట్ గా జీర్ణమవుతాయి. అలాగే గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే రోటీలో గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి రోటీని తింటే డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 


చపాతీలలో హెల్తీ మొత్తంలో ఉప్పుకూడా ఉంటుంది. 120 గ్రాముల గోధుమలో సుమారుగా 90 మి.గ్రా సోడియం ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి సోడియం చాలా అవసరం. అలాగే సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త ద్రవతను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా రోటీ రక్తం చిక్కగా ఉండేలా చేయదు. ఇది గుండె జబ్బుల సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. రోటీలో సోడియంతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. మధుమేహులు బరువు తగ్గడానికి అన్నం కంటే రోటీనే మంచిదంటారు నిపుణులు.

Latest Videos

click me!