రెగ్యులర్ గా సోయా తింటే ఏమౌతుంది..?

First Published | Aug 15, 2024, 10:52 AM IST

సోయాలో మనకు ప్రోటీన్ తో పాటు.. ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. థైరాయిడ్ ఉన్నవారు తప్పితే.... మిగిలినవాళ్లు అందరూ.. రెగ్యులర్ గా సోయా తినొచ్చు.
 

నాన్ వెజ్ ప్రియులకు ప్రోటీన్ ఈజీగా దొరికేస్తుంది. చికెన్, గుడ్డు తిన్నా.. బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది. కానీ.. వెజిటేరియన్స్ కి అలా కాదు.. ప్రోటీన్ కావాలంటే పన్నీర్ మాత్రమే తినాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ... పన్నీర్ మాత్రమే కాదు.. సోయా తిన్నా కూడా.. మన శరీరానికి అందాల్సిన ప్రోటీన్ అందుతుంది.  అసలు సోయాని ప్రోటీన్ కి పవర్ హౌస్ అని చెప్పచ్చు. ఒక్క ప్రోటీన్ మాత్రమే కాదు.. రెగ్యులర్ గా సోయా ని మన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల.. మనకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయట. మరి, ఆ ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం..
 

soya

సోయాలో మనకు ప్రోటీన్ తో పాటు.. ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. థైరాయిడ్ ఉన్నవారు తప్పితే.... మిగిలినవాళ్లు అందరూ.. రెగ్యులర్ గా సోయా తినొచ్చు.

ప్రతిరోజూ సోయా తినడం వల్ల..ఈజీగా బరువు తగ్గవచ్చట. ఎందుకంటే.. సోయాలో.. ఉంటే ఫైబర్, ప్రోటీన్  ఎక్కువగా ఉండటం వల్ల.. వీటిని తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఫలితంగా.. వేరే ఫుడ్స్ తినాలని అనిపించదు. దీంతో.. ఈజీగా బరువు తగ్గుతాం.
 

Latest Videos


సోయా తినడం వల్ల.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయం చేస్తాయి. అందుకే.. రెగ్యులర్ గా సోయా తినొచ్చు.


సోయాలో కాల్షియం, జింక్, కాపర్ లాంటి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి.. మన శరీరంలో ఎముకలను బలంగా మారుస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. అరుగుదల కూడా బాగుంటుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి.
 


ఎవరికైనా రక్త హీనత ఉంటే.. వాళ్లు కచ్చితంగా తమ డైట్ లో సోయా చేర్చుకోవాల్సిందే.. దీనిలో ఉండే ఐరన్.. మన శరీరంలో రక్త హీనతను తగ్గిస్తుంది.  శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలోనూ చాలా బాగా పని చేస్తుంది.
 

click me!