మండే ఎండలో బాడీని కూల్ గా ఉంచే ఫుడ్స్ ఇవి..!

First Published | Mar 5, 2024, 2:13 PM IST

ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇది మన ప్రాణాలను కూడా సులువుగా తీసేయగలదు. అందుకే ఈ ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొన్ని డ్రింక్స్ ను తప్పకుండా తాగాలి. అవేంటంటే? 
 

Image: Getty

ఎండాకాలంలో నీళ్లను చాలా ఎక్కువగా తాగాలి. ఎందుకంటే మన శరీరంలోని నీరంతా చెమట ద్వారా బయటకు వెళుతుంది. దీంతో శరీరంలో నీరు తగ్గి శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ డీహైడ్రేషన్ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ప్రాణాల మీదికి తెస్తుంది. అందుకే వేసవి తాపం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ఈ సీజన్ లో బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి, వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

cucumber

కీరదోసకాయ

కీరదోసకాయను ఎండాకాలంలో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో 95 శాతం వాటర్ ఉంటుంది. అందుకే దీన్ని తింటే మన శరీరం , చర్మం హైడ్రేట్ గా ఉంటాయి. కీరదోసకాయలను తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉండదు. అలాగే చర్మం కూడా తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Latest Videos


పుచ్చకాయ

ఎండాకాలంలో పుచ్చకాయలు పుష్కలంగా దొరుకుతాయి. ఈ పండ్లలో 92% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎండాకాలంలో ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా ఉండటానికి పుచ్చకాయలను ఖచ్చితంగా తినాలి. ఎండాకాలంలో పుచ్చకాయ మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి పోషణను, మనసుకు ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. ఈ పండ్లలో వాటర్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మేలు చేయడంతో పాటుగా శరీరాన్ని హైడ్రేట్ గా కూడా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు మంచి పోషకాల పండ్లు. ఈ పండ్లను కూడా ఎండాకాలంలో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఈ పండ్లలో 91 శాతం వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

పెరుగు

ఎండాకాలంలో పెరుగును ఖచ్చితంగా తినండి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలను అందించడమే కాకుండా.. చల్లగా కూడా ఉంచుతుంది. పెరుగును తింటే డీహైడ్రేషన్ వచ్చే సమస్యే ఉండదు. 85% వాటర్ ఉన్న పెరుగును తింటే ఎండాకాలం ఎండల నుంచి మన శరీరం రక్షించబడుతుంది. 
 

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లు మన దాహాన్న తీర్చడమే కాకుండా.. డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కొబ్బరి నీటిని తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

ఆరెంజ్

ఆరెంజ్ లు మంచి పోషకాల వనరులు. ఈ పండ్లలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో ఆరెంజ్ జ్యూస్ ను తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

click me!