రోజుకి ఎన్ని కప్పుల టీ తాగాలో మీకు తెలుసా?

First Published | May 15, 2024, 4:43 PM IST

అసలు.. రోజుకి ఎన్ని కప్పుల టీ తాగొచ్చు..? ఈ విషయాన్ని ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తాజాగా తెలియజేసింది.

భారతీయుల్లో 80శాతం మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాలంతో సంబంధం లేదు... వారికి ఉదయం లేవగానే టీ, కాఫీ గొంతులో పడాల్సిందే. అవి తాగిన తర్వాతే రోజు ప్రారంభించేవారు ఉంటారు. కొందరు అసలు టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచిది కాదు అని వాదిస్తుంటే.. కొందరు మాత్రం.. అవి లేకుండా.. మేం బతకలేం అన్నట్లుగా మాట్లాడతారు. 
 


టీ, కాఫీ తాగితే పర్వాలేదు కానీ.. ఎంత మొత్తంలో తాగుతున్నాం అనేది మాత్రం కచ్చితంగా చూసుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే... వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్్చరిస్తున్నారు. అసలు.. రోజుకి ఎన్ని కప్పుల టీ తాగొచ్చు..? ఈ విషయాన్ని ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తాజాగా తెలియజేసింది.
 


టీ, కాఫీలు ఎక్కువగా తాగితే ప్రమాదం తప్పదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. ఇటీవల ICMR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌తో కలిసి పదిహేడు కొత్త ఆహార జాబితాలను ప్రారంభించింది. ఈ జాబితాలో టీ వినియోగం , సరైన మొత్తం , సమయం వంటి వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

Coffee

దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు ICMR ఈ చర్య తీసుకుంది. టీ, కాఫీల్లో కెఫీన్‌ ఉందని, ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, వివిధ రకాల శారీరక సమస్యలను కలిగిస్తుందని ఐసీఎంఆర్ పరిశోధకులు తెలిపారు.
 

అయితే ఏ డ్రింక్‌లో కెఫిన్ ఎక్కువగా ఉంటుందో తెలుసా? ICMR ప్రకారం,  150 ml కాఫీలో 80-120 mg, ఇన్స్టాంట్  కాఫీ 50-65 mg, టీ 30-65 mg ఉంటుంది. అందువల్ల రోజుకు 300 మి.గ్రా కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి సురక్షితమని ఐసీఎంఆర్ తెలిపింది. మనలో చాలా మంది 150మిల్లీ టీటర్లు అంటే పావు కప్పు టీ తీసుకోరు. కప్పు నిండుగా అంటే తీసుకున్న ప్రతిసారీ 250 ఎం.ఎల్ కంటే ఎక్కువే తీసుకుంటారు.  దీనిని బట్టి.. ఎన్ని కప్పులు తాగొచ్చో.. మీరే కౌంట్ చేసుకోండి.
 

అలాగే,  భోజనానికి ఒక గంట ముందు , తర్వాత టీ , కాఫీలను నివారించమని సలహా ఇస్తుంది. ఎందుకంటే ఈ రెండు పానీయాలలో టానిన్లు ఉంటాయి. టానిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. తీసుకున్న భోజనాన్ని కూడా కలుషితం చేస్తాయి. అందుకే.. భోజనానికి గంట ముందు, గంట తర్వాత వీటికి దూరంగా ఉండటం మంచిది.
 

Latest Videos

click me!