ఏంటి ఈ ‘నో రా డైట్’.. సెలబ్రెటీలను ఆకర్షిస్తున్న ఈ డైట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

First Published Jun 15, 2024, 12:19 PM IST

సలాడ్స్ లో ఎక్కువగా పచ్చి కూరగాయలు తింటూ ఉంటారు. ఎందుకంటే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ... ఈ నో రా డైట్ లో పొరపాటున కూడా పచ్చివి వినకూడదు.


మనం ఈ మధ్యకాలంలో  చాలా రకాల డైట్ల పేర్లు విన్నాం. కీటో డైట్, క్రాష్ డైట్ లాంటి పేర్లు మీరు వినే ఉంటారు. అంటే... ఒక డైట్ లో ఆయిల్ లేకపోవడం, ఒక డైట్ లో రైస్ లేకపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే.. తాజాగా మరో డైట్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. అదే  నో రా డైట్. సెలబ్రెటీలు కూడా ఈ డైట్ పై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఈ డైట్ ని ఫాలో అవుతుండటంతో.. ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఈ డైట్ లో స్పెషాలిటీ ఏంటి అంటే.. పచ్చివి ఏవీ పొరపాటున కూడా తినరు. కేవలం.. నీటిలో ఉడకపెట్టినవి, ఆవిరి కింద ఉడకపెట్టినవి మాత్రమే తింటారు. మరి, ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం...
 

చాలా మంది ఆరోగ్యంగా ఉండాలి అంటే.. సలాడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. సలాడ్స్ లో ఎక్కువగా పచ్చి కూరగాయలు తింటూ ఉంటారు. ఎందుకంటే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ... ఈ నో రా డైట్ లో పొరపాటున కూడా పచ్చివి వినకూడదు. కేవలం ఉడకపెట్టినవి మాత్రమే తినాలి. మరి.. ఈ డైట్ తీసుకుంటే  ఏమౌతుందంటే..

వండిన ఆహారం పచ్చి ఆహారం కంటే సురక్షితమైనది. ఎందుకంటే దీన్ని వేడి చేసినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా, క్రిములు చనిపోయి, దాని వల్ల వచ్చే వ్యాధుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది. చాలా మాంసం, చేపలు లేదా కొన్ని కూరగాయలు కూడా హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, సరిగ్గా ఉడికించకపోతే అది మీకు ప్రయోజనం కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది.
 

పచ్చి ఆహారాన్ని తినడం వల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఉడికించిన ఆహారం తినడం వల్ల   దానిలోని కొన్ని కఠినమైన సమ్మేళనాలు విచ్ఛిన్నమై, వాటిని సులభంగా జీర్ణం చేస్తాయి.
అధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్న కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిని ఉడికించి తింటే, మీ శరీరం దానిని సులభంగా గ్రహించగలదు. వండిన ఆహారాన్ని తినడం మానసిక ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే మీరు ఆహారాన్ని వండినప్పుడు మంచి వాసన వస్తుంది. దాని రుచి కూడా చాలా పెరుగుతుంది. అటువంటి ఆహారాన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు.
 

Diet for Good immune system

వంట చేయడం వల్ల కొన్ని పోషకాల జీవ లభ్యత పెరుగుతుంది, టమోటాలలోని యాంటీఆక్సిడెంట్లు లైకోపీన్ , క్యారెట్‌లోని బీటా కెరోటిన్ వంట చేసిన తర్వాత మరింత సులభంగా గ్రహించబడతాయి. వంట చేయడం వల్ల ఖనిజాల శోషణను తగ్గించే ఫైటేట్ , ఆక్సలేట్ వంటి కొన్ని యాంటీన్యూట్రియెంట్లను క్రియారహితం చేస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆహారంలో ప్రయోజనాలు అప్రయోజనాలు రెండూ ఉన్నాయి, ఇది మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనా డైట్‌ని అనుసరించాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. ఈ ఆహారాన్ని అనుసరిస్తున్నప్పుడు, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన వంట పద్ధతులపై శ్రద్ధ వహించడం ముఖ్యం. నిపుణుల సలహా లేకుండా. ఏ డైట్ ని ఫాలో అవ్వకపోవడమే మంచిది.

Latest Videos

click me!